బీన్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి.వాటిలో బ్లాక్ బీన్స్ కూడా ఒకటి.
వీటిని కొందరు ఉడికించి తీసుకుంటే.మరి కొందరు కూరలు, సూప్స్ తయారు చేసి తీసుకుంటారు.
బ్లాక్ బీన్స్‌ను ఎలా తీసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటాయి.పైగా వీటిల్లో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.
మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం, థియామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు బ్లాక్ బీన్స్‌లో ఉంటాయి.అందుకే బ్లాక్ బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎన్నో జబ్బులకు కూడా చెక్ పెడుతుంది.
ముఖ్యంగా మధుమేహం వ్యాధి గ్రస్తులు బ్లాక్ బీన్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి.అలాగే బ్లడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరిగిపోతుంది.అయితే బ్లాక్ బీన్స్ తీసుకోవడం వల్ల.
అందులో ఉండే పోషకాలు చెడు కొలస్ట్రాల్‌ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి.దాంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఇటీవల కాలంలో బరువు తగ్గాలని ప్రయత్నించే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు.
ఇలాంటి వారు ఉడికించిన బ్లాక్ బీన్స్‌ను తీసుకుంటే.త్వరగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శాఖాహారుల్లో ఎక్కువ మంది ప్రోటీన్ లోపంతో బాధ పడుతుంటారు.అయితే బ్లాక్ బీన్స్ తీసుకుంటే శరీరానికి సరిపడా ప్రోటీన్ అందుతుంది.
లైంగిక పని తీరు మరియు సంతానోత్పత్తిని మెరుగుపరచడంలోనూ బ్లాక్ బీన్స్ ఉపయోగపడతాయి.అందువల్ల.సంతానలేమి, లైంగిక సమస్యలు ఎదుర్కొనే వారు డైట్‌లో బ్లాక్ బీన్స్ చేర్చుకుంటే మంచిది.ఇక బ్లాక్ బీన్స్ తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.