సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు రాజమౌళి ( Director Rajamouli )కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మహేష్ బాబు అలాగే రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇకపోతే SSMB29 మూవీ( SSMB29 Movie ) ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అవుతోంది.అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించబోతున్నారు.ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనల్ చేసిన జక్కన్న రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసేశారు.1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించబోతున్నారట.రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని జక్కన్న సిద్ధం చేయబోతున్నారట.ప్రొడక్షన్ లోకి వెళ్లిన తర్వాత ఇంకా బడ్జెట్ పెరగొచ్చని భావిస్తున్నారు.అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ( Hollywood Production House )భాగం కాబోతోందని సమాచారం.
అయితే అదెవరు అనేది తెలియాల్సి ఉంది.సినిమాని ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళడానికి జక్కన్న వారిని రంగంలోకి దించారని అనుకుంటున్నారు.కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ బాబుకి ఎంత రెమ్యునరేషన్ అయిన ఇవ్వడానికి అయిన నిర్మాత సిద్ధంగా ఉన్నారు.కానీ మహేష్ బాబు మాత్రం ఈ రెండు పార్ట్స్ కూడా అస్సలు రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేయబోతున్నారట.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి ఈ సినిమా రెమ్యునరేషన్ బదులు లాభాల్లో వాటా తీసుకుంటానని మహేష్ బాబు చెప్పారని సమాచారం.రాజమౌళి కూడా రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటానే తీసుకోబోతున్నారట.
లాభాల్లో 25 శాతం వాటిని మహేష్ బాబు, రాజమౌళికి ఇవ్వడానికి నిర్మాత అంగీకరించారని టాక్.దీంతో వీరి రెమ్యునరేషన్ కూడా మూవీ కోసమే ఖర్చు చేయబోతున్నారు.
ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ఒక హాలీవుడ్ డైరెక్టర్ కూడా ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా ఇండియన్ హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కన్ఫర్మ్ అయ్యిందట.
అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.