కేవలం ఆక్టర్ గానే కాకుండా, నిర్మాతగా కూడా మంచి దూకుడు చూపోతున్నాడు దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ).తాజాగా రానా ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియా వారు ఒక కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
ఈ చిత్రానికి దుల్కర్ సల్మాన్ ను హీరోగా అనౌన్స్ చేసారు.భారత దేశ చిత్ర పరిశ్రమలో దుల్కర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
అతి తక్కువ కాలంలోనే హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషలలో చిత్రాలు చేస్తూ, ప్రతి పరిశ్రమలోనూ మంచి విజయాలను అందుకొని తనకంటూ ఒక మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు.తన వెర్సటైల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తున్నాడు.
తాజాగా మరిన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు దుల్కర్.నిన్న అతని పుట్టిన రోజు కావడంతో లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి.
లేటెస్ట్ గా “సర్”( SIR ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వివేక్ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు.ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు మేకర్స్.సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి “లక్కీ భాస్కర్” ( Lucky Bhaskar (అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు.ఇకపోతే తమిళంలో కూడా దుల్కర్ ఒక సినిమా సైన్ చేసారని తెలుస్తోంది.
సూర్య, సుధా కొంగర కంబినేషన్లో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ చిత్రంలో లీడ్ రోల్ లో దుల్కర్ కనిపించబోతున్నారనే వార్త వినిపిస్తోంది.ఇక మలయాళం లో దుల్కర్ “కింగ్ అఫ్ కొత్త”( King of New ) అనే చిత్రం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ టీజర్ జనాలలో మంచి బజ్ క్రియేట్ చేసింది.ఈ మధ్యే క్యారెక్టర్స్ మరియు కాస్ట్ ని చూపిస్తూ ఒక వీడియోని విడుదల చేసారు.
ఇప్పుడు దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఒక పాటను విడుదల చేసారు.బాలీవుడ్ లో కూడా దుల్కర్ “గన్స్ అండ్ గులాబ్స్”( Guns and Roses ) అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
ఫామిలీ మాన్, ఫర్జీ, వంటి విజయవంతమైన సిరీస్ లు తెరకెక్కించిన రాజ్ అండ్ డికే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఆగష్టు 18న విడుదల కాబోతోంది.
ఇక అసలు విషయానికొస్తే… నిన్న దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా “కాంతా”( Kanta ) అనే సినిమాను ప్రకటించారు.ఈ సినిమాకు దుల్కర్ కూడా మరో నిర్మాతగా ఉండబోతున్నారట.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతుంది.ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించబోయేది సెల్వమణి సెల్వరాజ్ అని తెలుస్తోంది.సెల్వమణి సెల్వరాజ్ ఇంతకుముందు నిల అనే చిత్రానికి రైటర్ గా పనిచేసారు.
లైఫ్ అఫ్ ఫై చిత్రం దర్శకుడికి అస్సిస్టెంట్గా పనిచేశారు.