పూరీ జగన్నాథ్, అలీలకు 2025 కలిసొస్తుందా.. వీళ్లు పూర్వ వైభవం సాధిస్తారా?

2025 సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ సంవత్సరం కెరీర్ పరంగా కలిసిరావాలని కోరుకున్న కోరికలు నెరవేరాలని చాలామంది భావిస్తున్నారు.అయితే ఈ ఏడాది కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన డైరెక్టర్ల జాబితాలో పూరీ జగన్నాథ్( Puri Jagannath ) ఉన్నారు.

 Will Puri Jagannath Achieve Success With New Movies Details, Puri Jagannath, Com-TeluguStop.com

దర్శకుడిగా పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు.పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

అయితే లైగర్,( Liger ) ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) సినిమాల ఫలితాలు పూరీ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.అటు పూరీ జగన్నాథ్ ఇటు అలీలకు( Ali ) పూర్వ వైభవం రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అలీకి ప్రేక్షకుల్లో క్రేజ్ బాగానే ఉన్నా గత కొన్నేళ్లలో అలీ నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు.

Telugu Ali, Puri Jagannath, Ismart Shankar, Liger, Tollywood-Movie

2025 సంవత్సరం అటు పూరీకి ఇటు అలీకి కలిసిరావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.పూరీ జగన్నాథ్ ప్రస్తుతం యంగ్ హీరో డేట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.టాలీవుడ్ యంగ్ హీరోలు పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తే ఆయన ప్రూవ్ చేసుకోవడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు.

ఇప్పటికీ చాలామంది నిర్మాతలు పూరీతో సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు.

Telugu Ali, Puri Jagannath, Ismart Shankar, Liger, Tollywood-Movie

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్( Bellamkonda Suresh ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ తో సినిమాను నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.అయితే కెరీర్ గురించి పూరీ జగన్నాథ్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాల్సి ఉంది.టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కొత్త ఏడాదిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.2025 సంవత్సరం ఆ ఆశలను నిజం చేస్తుందేమో చూడాల్సి ఉంది.ఫ్లాపుల్లో ఉన్న టాలీవుడ్ దర్శకులకు సైతం ఈ ఏడాది కలిసిరావాలని సినీ అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube