గేమ్ ఛేంజర్ మూవీతో ఆమెకు అవార్డ్ పక్కా.. థమన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్లో వినిపిస్తున్న పేరు గేమ్ చేంజర్.( Game Changer ) తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్( Ram Charan ) కియారా అద్వానీ( Kiara Advani ) జంటగా నటించిన విషయం తెలిసిందే.

 Thaman React Anjali National Award Game Changer Details, Thaman, Anjali, Game Ch-TeluguStop.com

సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకు తమన్( Thaman ) సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.రామ్‌ చరణ్‌ సోలో హీరోగా నాలుగు ఏళ్ల క్రితం వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.కానీ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

Telugu Anjali, Anjaligame, Dil Raju, Game Changer, Kiara Advani, Music Thaman, N

ఆచార్య సినిమాలో ముఖ్య పాత్రలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.అయితే ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో రామ్‌ చరణ్ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ని అందుకోబోతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు బలంగా ప్రచారం చేస్తున్నారు.శంకర్‌( Shankar ) వింటేజ్ సినిమాల తరహాలో ఈ సినిమా మంచి సోషల్ మెసేజ్‌ తో పాటు, ఒక మంచి కమర్షియల్‌ సినిమా మాదిరిగా ఉంటుంది అంటూ మేకర్స్ హామీ ఇస్తున్నారు.ఇకపోతే తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఛాన్స్ వచ్చిన సమయంలో షాక్ అయ్యాను.శంకర్ గారి సినిమాకు సంగీతాన్ని ఇవ్వగలనా అని భయ పడ్డాను.చాలా జాగ్రత్తగా సినిమా కోసం వర్క్‌ చేశాను.2022 చివర్లోనే సినిమా పూర్తి కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.సినిమా కోసం చాలా కష్టపడి రెడీ చేసిన జరగండి పాట లీక్ అయిన సమయంలో నిద్ర పట్టలేదు.

Telugu Anjali, Anjaligame, Dil Raju, Game Changer, Kiara Advani, Music Thaman, N

ప్రాధమిక వర్షన్‌ బయటకు వచ్చిందని తెలిసిన వెంటనే ఏం చేయాలో పాలు పోలేదు.దిల్‌ రాజు, శంకర్‌ గారు నాకు మద్దతుగా నిలిచారు.ఆ సమయంలో వెంటనే జరగండి పాటను విడుదల చేశాము.

అప్పుడు పాటను విడుదల చేసినా ఇంకా ఫ్రెష్‌గానే పాట ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని తమన్‌ అన్నాడు.ఇక ఈ సినిమాలో చరణ్ గారి పాత్ర గురించి ప్రముఖంగా స్పందించాడు.

రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించాడు.ఆయన నుంచి ఫ్యాన్స్‌ ఏం ఆశిస్తున్నారో అదే ఈ సినిమాలో చూస్తారంటూ తమన్‌ మెగా ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న అంజలి( Anjali ) నటనకు జాతీయ అవార్డ్‌ ఖాయం అంటూ తమన్‌ ధీమా వ్యక్తం చేశారు.కచ్చితంగా ఆమె నటన అందరికీ నచ్చుతుంది.

అంతే కాకుండా ఆమెకు కచ్చితంగా అవార్డులు వస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు.సినిమా రీ రికార్డింగ్‌ సమయంలో చూసిన తాను సర్‌ప్రైజ్ అయ్యాను అన్నాడు.

అంజలి నటన విషయంలో ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ స్పందన వస్తుందని అన్నారు థమన్.ఈ సందర్భంగా థమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా తమన్ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube