ఎలా గౌరవించాలో మీరు నేర్పించక్కర్లేదు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే టాలీవుడ్ బాలీవుడ్ లో సౌత్ వర్సెస్ బాలీవుడ్ ఇండియా అనే విషయంపై చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ తాజాగా ఈ విషయంఫై మరింత ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.

 Suryadevara Naga Vamsi Counter Bollywood Analyst Sumit Kadel Details, Suryadevar-TeluguStop.com

తాజాగా ఇదే అంశంపై నిర్మాతల రౌండ్‌ టేబుల్‌లో తెలుగు నిర్మాత నాగవంశీ,( Naga Vamshi ) హిందీ ప్రొడ్యూసర్‌ బోనీ కపూర్‌( Boney Kapoor ) మాట్లాడారు.దక్షిణాది ఇండస్ట్రీ బాలీవుడ్‌ పై ప్రభావం చూపించిందని, కానీ హిందీ చిత్ర పరిశ్రమ మాత్రం ముంబైకే పరిమితమైందని సెటైర్లు వేశాడు.

అది బోనీ కపూర్‌ ఒప్పుకోలేదు.రష్యాలో ఇప్పటికీ రాజ్‌ కపూర్‌ ను గుర్తు చేసుకుంటారు.

ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా అమితాబ్‌ బచ్చన్‌, షారూఖ్‌ ఖాన్‌ గురించి మాత్రమే మాట్లాడతారు.షారూఖ్‌, బిగ్‌బీకి ద కింగ్‌ ఆఫ్‌ మొరాకో అన్న బిరుదు ఇచ్చారు అని బోనీ చెప్పబోతుండగా ఇంతలో నాగవంశీ కలుగజేసుకోవడంతో.

అతడిని పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో దూరడంపై బాలీవుడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ గుప్తా( Director Sanjay Gupta ) మండిపడ్డాడు.

బోనీ గారిని ఎగతాళి చేస్తున్న ఈ అసహ్యకరమైన వ్యక్తి ఎవరు? అని ఎక్స్‌ వేదికగా ఫైర్‌ అయ్యాడు.అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబు వంటి సీనియర్‌ నిర్మాతల ముందు ఇలా దర్జాగా కూర్చుని ముఖానికి వేళ్లు చూపిస్తూ మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించాడు.బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు సుమిత్‌( Sumit ) సైతం ఈ వివాదంపై స్పందిస్తూ నాగవంశీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తెలుగు చిత్రపరిశ్రమ( Tollywood ) పాన్‌ ఇండియా ట్రెండ్‌ ను పరిచయం చేసింది అనడంలో సందేహం లేదు.బాలీవుడ్‌( Bollywood ) ఇంకా మసాలా సినిమాల్నే నమ్ముకుంటూ ఎక్కడో ఆగిపోయింది.

కానీ ఇక్కడ బోనీ కపూర్‌ గారిని అగౌరవపర్చడం అనవసరం.

చెప్పాలనుకున్నది మర్యాదగా చెప్పుంటే అయిపోయేది.ఎంతోమంది దక్షిణాది ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు, హీరోలు హిందీ సినిమాపై ఎనలేని ప్రేమ చూపిస్తారు.అమితాబ్‌, ప్రకాశ్‌ మెహ్రా, యష్‌ చోప్రా, మన్మోహన్‌ దేశాయ్‌ వంటి గొప్పవాళ్ల సినిమాలను ఆదర్శంగా తీసుకునే కమర్షియల్‌ సినిమాలు తీస్తున్నామని చెప్తుంటారు.

సౌత్‌ సినిమాల కలెక్షన్స్‌ లో హిందీ బాక్సాఫీస్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని మర్చిపోవచ్చు.విమర్శ తప్పనడం లేదు, కానీ అవమానించడం మాత్రం తప్పే, ఇలా యాటిట్యూడ్‌ చూపిస్తే పాతాళంలోకి వెళ్లిపోతారు జాగ్రత్త! ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది అని ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్ పై నాగవంశీ స్పందిస్తూ. పెద్దవారిని ఎలా గౌరవించాలనేది నువ్వు నేర్పించనక్కర్లేదు.బోనీ కపూర్ గారిని మీ కంటే ఎక్కువే గౌరవిస్తాము.ఆ చర్చలో ఎక్కడా బోనీని అగౌరవపర్చలేదు.

మేమంతా ఎంతో బాగా మాట్లాడుకున్నాము.నవ్వుకున్నాము.

ఇంటర్వ్యూ అయ్యాక ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకున్నాము.కాబట్టి నువ్వు చూసినదాన్ని బట్టి అదే నిజమని డిసైడ్‌ అయిపోకండి అని రాసుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube