మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ మొదటి సారి బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి( Unstoppable Show ) హాజరయ్యారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా బాలకృష్ణ చరణ్ సినిమాల గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి కూడా ప్రశ్నలు అడిగారని తెలుస్తుంది.
ఇక ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తో పాటు ఆయన చిన్ననాటి స్నేహితుడు హీరో శర్వానంద్( Sharwanand ) కూడా పాల్గొన్నారు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్( Akira Nandan ) గురించి కూడా బాలయ్య ప్రశ్నలు వేశారు.అకీరా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.
తను చాలా సైలెంట్ గా ఉంటాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు అంతేకాకుండా తన నాన్న లాగే చాలా పద్ధతిగా ఉంటారు అంటూ చరణ్ తెలిపారు.
ఇక నాకు బుక్స్ చదవడం మొదటి నుంచి కూడా పెద్దగా ఇష్టం ఉండేది కాదు అయితే అకీరా మాత్రం తనకు ఎప్పుడు ఇచ్చినా బుక్స్ గిఫ్ట్ గా ఇచ్చేవాడు.అలా అకీరా తనకు బుక్స్ ఇవ్వటం వల్ల నాకు బుక్స్ చదవటం ఇష్టం లేకపోయినా అది అలవాటుగా చేసుకొని ఇప్పుడు తను ఇచ్చిన బుక్స్ అన్నింటినీ కూడా చదువుతూ ఉంటానని ఈ అలవాటును తాను తన తమ్ముడి వద్ద నుంచి నేర్చుకున్నాను అంటూ చరణ్ చెప్పారు.తన తమ్ముడి గురించి చరణ్ చేసిన ఈ కామెంట్స్ ఇటు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులను, మెగా అభిమానులను ఎంతో సంతోష పెడుతున్నాయి.