ఈ సంవత్సరంలో శ్రీరామనవమికి( Sri Rama Navami ) ప్రత్యేకమైన ప్రాముఖ్యత అన్నది ఉంది.ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత అయోధ్యలో బలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22వ తేదీన అత్యంత ఘనంగా జరిగింది.
భక్తులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ బాల రామున్ని దర్శించుకుని ఆనందోత్సాహాల తిరిగి వెళ్లారు.అయితే 2024లో శ్రీరామనవమి తర్వాత కొన్ని విపత్తులు జరుగుతాయని బ్రహ్మంగారు ఏనాడో తెలిపారు.
బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని చాలా విషయాలు కూడా ఉన్నాయి.బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( Potuluri VeeraBrahmendraswamy )భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంధాలలో రచించి భద్రపరిచినవి.

ప్రస్తుత కాలంలో జరిగే ఎన్నో విషయాలను ఆయన చెప్పి కాలజ్ఞానానికి సంబంధించి అప్పుడే చెప్పడం జరిగింది.ప్రతిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు కూడా ఉన్నాయి.అయితే ఈ బ్రహ్మంగారు ఆంధ్రలో జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని చెబుతారు.అయితే నాలుగు యుగాల్లో కలియుగం అన్నది అన్నింటికంటే చిన్నది.
అలాగే అన్నింటికంటే భయంకరమైనది కూడా.కలియుగంలో( Kali Yugam ) పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుంది.
ఆ సమయంలో భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది.

కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో, వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అన్న విషయాల గురించి కాలజ్ఞానంలో వివరించడం జరిగింది.అలాగే కలియుగంలో ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండే పరిస్థితులు కూడా కనిపించడం లేదు.అలాగే విచిత్రమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి.
ఇక బంగారం ధర సామాన్య మానవుడు కొనలేని పరిస్థితికి వస్తుంది.అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం దేశాల మధ్య వర్గ వైశ్యాలు జరుగుతాయి.
ఈ విధంగా మరిన్ని దేశాలకు ఈ గొడవలు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది.అంతేకాకుండా ఉన్నట్టుండి వరదలు, భూకంపాలు మహానగరాలను ముంచే అవకాశాలు ఉన్నాయి.