శాసనసభలో బీఆర్ఎస్ మినిస్టర్స్ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ మంత్రులకు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది.అసెంబ్లీలో తమకు కార్యాలయం ఇవ్వాలని ఈటల రాజేందర్ కోరారు.

 Brs Ministers Vs Bjp Mla In Legislative Assembly-TeluguStop.com

ఈటల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హరీశ్ రావు ఐదుగురి కంటే ఎక్కువ ఉంటేనే కార్యాలయం ఇవ్వాలన్న నిబంధన ఉందని గుర్తు చేశారు.నిబంధనలకు లోబడే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

దీనిపై ఒక్క సభ్యుడు ఉన్న జేపీ, సీపీఐ, సీపీఎంలకు గతంలో ఆఫీస్ ఇచ్చారన్న ఈటల… నిబంధనల కంటే కన్వినెంట్ కూడా ముఖ్యమేనని వెల్లడించారు.

బయటకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే ఈటల మాట్లాడుతున్నారని మంత్రి తలసాని అన్నారు.

అసెంబ్లీ ఏర్పడిన నాటి నుంచే రూల్స్ ఉన్నాయని తెలిపారు.ఏదైనా ఉంటే స్పీకర్ తో మాట్లాడుకోవచ్చని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube