ఏపీలో టీడీపీకి షాక్ తగిలింది.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు( Gollapalli Surya Rao ) పార్టీని వీడారు.
ఈ క్రమంలోనే పార్టీ పదవులతో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.కాగా ఆయన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాజోలు నియోజకవర్గ ఇంఛార్జిగా( Rajolu Constituency Incharge ) గొల్లపల్లి సూర్యారావు పని చేశారు.
టీడీపీ – జనసేన పొత్తులో( TDP Janasena Alliance ) భాగంగా రాజోలు నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయించాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే తనకు టికెట్ రాదని భావించిన సూర్యారావు పార్టీని వీడారని తెలుస్తోంది.ఇక తాజాగా గొల్లపల్లి విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ( YCP ) గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.