గత ఏడాది సంక్రాంతికి కానుకగా వచ్చిన ఎఫ్ 2 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఘన విజయం సాధించడంతో ఎఫ్2 కు సీక్వెల్ ఎఫ్ 3ని స్పీడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు అనీల్ రావిపూడి భావించాడు.
కాని ఆయన అనుకున్నట్లుగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు.ఎఫ్ 3 వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలకు సాధ్యం అయ్యేలా లేదు.
సీక్వెల్‌కు ఇప్పటికే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్‌లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వీరిద్దరి డేట్లు కలిసే సమయంకు సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు అనీల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు.
అంతా బాగానే ఉంది, త్వరలోనే షూటింగ్‌కు వెళ్తామని అనీల్ రావిపూడి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఎఫ్ 3 ఆలస్యం అయ్యేలా ఉంది.అందుకు కారణం వెంకటేష్ అంటూ కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నారప్ప సినిమాను వెంకీ పూర్తి చేయాల్సి ఉంది.ఆ సినిమా షూటింగ్‌ను మరో మూడు నాలుగు నెలల వరకు ప్రారంభించే అవకాశాలు లేవని అంటున్నారు.
కరోనా భయం మరియు రానా వివాహ ఏర్పాట్లతో బిజీగా ఉన్న కారణంగా నారప్ప సినిమాను వాయిదా వేశారు.వెంకీ మూవీ నారప్ప పూర్తి అయితే తప్ప ఎఫ్ 3 ప్రారంభం అవ్వదు.