పచ్చి బఠాణి మంచి రంగు,రుచిని కలిగి ఉంటాయి.వీటిని ఎక్కువగా కూరల్లో వేసుకుంటూ ఉంటాం.
కూరల్లో వేసుకుంటే కొరకు మంచి రుచి వస్తుంది.అంతేకాక ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది.
పచ్చి బఠాణిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.
పచ్చి బఠాణిలో ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండుట వలన పిండి పదార్ధాలను చాలా సులభంగా జీర్ణం చేస్తాయి.దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉండటం వలన మధుమేహం ఉన్నవారికి పచ్చి బఠాణీ మంచి ఆహారం అని చెప్పవచ్చు.
పచ్చి బఠాణిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి జీర్ణ క్రియ బాగా జరిగేలా ప్రోత్సాహం ఇస్తుంది.పచ్చి బఠాణిలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.
పిండం ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన పుట్టబోయే బిడ్డకు ఎటువంతో పోషకాహార లోపం ఉండదు.
పచ్చి బఠాణిలో ఉండే విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్‌లు వాపులు, నొప్పులను తగ్గించటంలో బాగా సహాయపడతాయి.గాయాలను కూడా త్వరగా నయం చేస్తాయి.నొప్పులు ఉన్నవారు పచ్చి బఠాణి తింటే త్వరగా నయం అవుతాయి.వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేలా చర్మ కణాలను ప్రోత్సహిస్తాయి.కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు తగ్గుతుంది.