సినిమా ఇండస్ట్రీకి ఈమధ్య వయసుతో పెద్దగా పని లేనట్టుగా కనిపిస్తుంది.ఎందుకంటే మన టాలీవుడ్ కాస్త పక్కకు పడితే బాలీవుడ్ లో వయస్సు పెరిగిన హీరోయిన్స్ కి బోలెడంత డిమాండ్ ఉంది.
వయసు పెరిగినా కూడా ఎక్కడ ఆ ప్రభావం కనబడకుండా మెయింటైన్ చేయడంలో బాలీవుడ్ హీరోయిన్స్ ముందు వరసలో ఉంటారు.ఎప్పుడో పెళ్లయినా కూడా, పిల్లలని కన్నా కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఉన్నారు.
ఇక వీరి దాటికి కుర్ర హీరోయిన్స్ సైతం బేజారు పడిపోతున్నారు.ఇక యువ హీరోయిన్స్ అవకాశాలు అందుకుంటున్న వరుస పరాజయాలను మూట కట్టుకుంటుంటే సీనియర్ హీరోయిన్స్ మాత్రం వరుస అవకాశాలను అలాగే హిట్స్ ని తమ ఖాతాలో వేసుకొని ముందుకు దూసుకెళ్తున్నారు.
అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్నటి తరం హీరోయిన్ టబు గురించి.దాదాపు 51 యేళ్ల వయసు ఉన్న ఆమె ఇంకా కూడా నిత్య యవ్వనంతో సినిమాలో ఫుల్ బిజీగా ఉంది.
ఇక 1982 లో ఆమె కెరియర్ మొదలైంది.నేటికీ ఆమె సినిమా కెరియర్ స్టార్ట్ చేసి 40 ఏళ్లు కావస్తోంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలెట్టిన ఆమె ప్రయాణం ఇప్పటికి కొనసాగుతూ ఉండడం విశేషం.ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కూడా దాదాపు 30 ఏళ్లు కావస్తోంది.
అయినా కూడా ఆమె నేటికి అదే యవ్వనంతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.

ముగిస్తున్న ఈ 2022లో కూడా ఆమె రెండు సినిమాల్లో నటించింది ఒకటి భూల్ భులైయా సీక్వెల్ కాగా మరొకటి దృశ్యం సీక్వెల్.ఈ రెండు సినిమాలు కూడా ఘనవిజయం సాధించుకున్నాయి.ఇక కుర్ర హీరోయిన్ లు అలియా భట్, దీపిక పదుకొనె వంటి హీరోయిన్స్ సైతం ఫ్లాపులతో సతమతమవుతున్నారు.
కానీ 2023లో సైతం మరొక మూడు సినిమాలలో నటించబోతోంది టబు.కుట్టే, భోళా, ఖుఫియా వంటి సినిమాల్లో నటిస్తోంది.వయసు పెరిగిన వన్నె తెగ్గని అందంతో నేటికీ పెళ్లి చేసుకోకుండా సినిమాల్లో బిజీగా ఉండటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు.







