పాలకూరను ఇలా తీసుకుంటే టేస్ట్ తో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు!

సాధారణంగా కొందరు పాలకూర అంటేనే ఆమడ దూరం పారి పోతుంటారు.అందుకు కారణం దాని రుచి, వాసన.

 Consuming Spinach Like This Is Good For Health! Spinach, Spinach Benefits, Healt-TeluguStop.com

చాలా మందికి పాలకూర అస్సలు పడదు.ఈ క్రమంలోనే దాని జోలికి కూడా వెళ్లరు.

అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతారు.పాలకూరను ఆకుకూరల్లో రారాజు అంటారు.

ఎందుకంటే పాలకూరలో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం ఇలా ఎన్నో అమోఘమైన పోషక విలువలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.

అయితే పాలకూరను ఇష్టపడని వారు.దాన్ని పూర్తిగా ఎవైడ్ చేయ‌కుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే టేస్ట్ తో పాటు బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ను సైతం పొందొచ్చు.

అందుకోసం ముందుగా ఒక కప్పు పాలకూర ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.అలాగే ఒక అరటి పండును తీసుకుని తొక్క తొల‌గించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కడిగి పెట్టుకున్న పాలకూర, క‌ట్‌ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్, ఒక కప్పు దానిమ్మ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజల పొడి, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పాలకూర బనానా స్మూతీ సిద్ధం అవుతుంది.

ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది.ఈ స్మూతీని వారంలో కనీసం రెండు సార్లు తీసుకుంటే బరువు తగ్గుతారు.రక్తహీనత స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

సంతాన సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.మూత్రపిండాలు శుభ్రం గా మారతాయి.

చర్మం సైతం యవ్వనంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube