సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎవ్వరికీ సదాభిప్రాయం ఉండదు.ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వారు ఎవరైనా కూడా చెడిపోతారు అనే భ్రమలో ఉంటారు చాలామంది.
ఇక్కడికి వచ్చాక అన్ని అలవాట్లు వస్తాయని, చెడు స్నేహాలు కూడా వస్తాయని , పిల్లలు పాడవుతారని భావించే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు.సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆ దురలవాట్లకు చాలా తక్కువ మంది దూరంగా ఉంటారు.
ఇది ఇప్పుడున్న పరిస్థితి మాత్రమే కాదు.బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.
నాటి స్టార్ హీరోలలో చాలామంది ఎంతో నిబద్దతుతో ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం దారి తప్పి కనుమరుగైన వారు కూడా ఉన్నారు.
అయితే ఇప్పుడున్నంత యాక్టివ్ గా అప్పట్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ లేకపోవడంతో వారి విషయాలు బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసేవి.
బయటకు రాకపోయినా కూడా హీరో, హీరోయిన్ల మధ్య ఉన్నా కొన్ని బంధాలు అప్పటి జర్నలిస్టులకు, మీడియా వారికి బాగానే తెలుసు.ఇక అప్పట్లో కూడా హీరోయిన్స్ కి ఇప్పుడున్నట్టుగానే అవకాశాలు రావాలంటే అందరితో సర్దుకుపోవాలి అన్నట్టుగానే ఉండేది పరిస్థితి.
అందుకే హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటే సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తాయి అని అప్పటి నుంచే భావించేవారు.ఇక సీనియర్ హీరో ఎన్టీఆర్ అంటే అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో మనందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ ఎంతో అందగాడు అందుకే అతనితో చాలామంది హీరోయిన్స్ కి లింక్లు కడుతూ అనేక వార్తలు వచ్చేవి.కానీ ఎన్టీఆర్ బయట ప్రపంచానికి కనిపించడంతా వ్యామోహ పురుషుడు అయితే కాదు.అతను ఏనాడు దారి తప్పింది లేదు.సినిమా చేయడం, షూటింగ్ కి వెళ్లడం, ఇంటికి రావడం … అంతే తప్ప తనకు మరొక వ్యసనం ఉండేది కాదు.
ఎన్టీఆర్ చరిత్రలో దారితప్పిన సంఘటనలు లేవు.ఒక్క సిగరెట్ అలవాటు తప్ప మరే అలవాట్లు కూడా అన్నగారికి లేవు.ఆ విషయం అతనితో దగ్గరగా ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు.ఎన్టీఆర్ తో కాలంలో చాలామంది నటీనటులు ప్రేమలు, పెళ్లిళ్లు, మద్యం, గుర్రెపు పందాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఉండేవారు.
అయినా కూడా అలాంటి వాటికి దూరంగా ఉంటూ వారందరిని ప్రత్యక్షంగా చూస్తూ తన జీవితం తాను మాత్రమే అన్నట్టుగా బ్రతికారు అన్నగారు.అందుకే ఆయన ఒక స్థిరత్వం కలిగిన మహా మనిషి.
ఒక కృష్ణ కుమారి విషయంలో మాత్రం అయన ఎందుకో బలహీనపడ్డారు.