కౌంటింగ్ సెంటర్ వద్ద మూడంచెల భద్రత

నల్లగొండ:జిల్లా కేంద్రంలోని అర్జాల బావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ నందు ఆదివారం జరిగే మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా కౌంటింగ్ సెంటర్ వద్ద 470 మంది పోలీస్ సిబ్బంది,మూడు కంపెనీల కేంద్ర బలగాలతో బారి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ తెలిపారు.

శనివారం కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఎవరైతే కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చే అభ్యర్దులు,పోలింగ్ ఏజెంట్ లు తమ వాహనాలకు లక్ష్మి గార్డెన్స్ నందు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని,అక్కడ తమ వాహనాలను పార్కింగ్ చేసుకొని అక్కడ నుండి ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన బస్ లలో కౌంటింగ్ సెంటర్ వద్దకు రావాలని సూచించారు.

కౌంటింగ్ సెంటర్ కి వచ్చే అభ్యర్దులు జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన గుర్తింపు కార్డులు తప్పని సరిగా తీసుకురావాలని,ఎలాంటి ఎలక్రానిక్ వస్తువులు సెల్ ఫోన్స్,లాప్ టాప్,ఎలాక్రానిక్ వాచెస్,వీడియో కెమెరాలు లాంటివి తీసుక రావద్దని అన్నారు.

నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లదే పై చెయ్యి

Latest Nalgonda News