క్రికెట్ అభిమానులకి ఒక శుభవార్త.ఐపీఎల్ సీజన్ 2022 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసింది.
దీనికి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది.కాగా ఈ సిరిస్ మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొట్టనుంది.ఇదిలా ఉండగా ఐపీఎల్ ప్రొమోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ రిలీజ్ చేశారు.
అలాగే ఆ ట్వీట్ కింద టాటా ఐపీఎల్ చూసేందుకు, ఐపీఎల్ కోసం మీ ప్లాన్స్ ఏంటి అని ఐపీఎల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఐపీఎల్ కొత్త సీజన్ ప్రోమోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక సరికొత్త అవతారంలో అభిమానులకు కనిపించారు.కొత్త ప్రోమోలో ధోనీ భలే ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు.ధోనీ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఐపీఎల్ ప్రోమోలో ధోనీ ఓల్డ్ లుక్ లో కనిపిస్తారు.మొదట ధోనీ ఓల్డ్ లుక్‌లో ఐపీఎల్ చూస్తున్నట్లు కనిపించారు.
ఐపీఎల్ చూసేందుకు తాను ఏమైనా చేస్తానని పెద్దాయన గెటప్‌లో ఉన్న ధోనీ నిరూపించారు.
ఓల్డ్ లుక్‌తో ఉన్న ధోనీ కొందరు పిల్లలతో కలిపి ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తుండగా అంతలోనే ఫోన్ కాల్ వస్తుంది.
ధోనీ సైగ చేయడంతో ఆయన కూతురు ఫోన్ లిఫ్ చేస్తుంది.నాన్నతో మాట్లాడాలని అవతలి వ్యక్తి అడగగా.తాను చనిపోయానని చెప్పమంటూ కూతురికి ధోనీ సైగ చేస్తాడు.ధోనీ కూతురు కూడా పాపా ఔట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
ఐపీఎల్ చూసేందుకు ఫ్యాన్స్ ఏమైనా చేస్తారని క్యాప్షన్‌తో ఈ ప్రొమోను ధోనీ ప్రమోట్ చేసినట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ధోని నయా లుక్ అదుర్స్ అంటున్నారు అభిమానులు.