బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డ్రగ్స్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో పాల్గొనడంతో అతనిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ కేసులో భాగంగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ తో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.వీరి అరెస్ట్ మెమో ప్రకారం.
వీరి నుంచి అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 టాబ్లెట్లు సీజ్ చేశారు.
ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను పోలీసులు కొన్ని గంటల సమయం పాటు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
ఇందులోభాగంగా అతనిపై నేరారోపణ రుజువైతే అతనికి కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే అరెస్టయిన వారిపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సీ), 20 (బీ), 27 రెడ్ విత్ సెక్షన్ 35లు నమోదు చేసింది.

సెక్షన్ 8(సీ) ప్రకారం ఎవరు ఏ విధమైనటువంటి మాదకద్రవ్యాలను ఎగుమతి దిగుమతి చేయకూడదు.సెక్షన్ 20 (బీ), గంజాయి ఉల్లంఘనకు సంబంధించిన కేసు ఈ కేసులో తక్కువస్థాయిలో మాదకద్రవ్యాలు దొరికితే ఏడాది కాలం పాటు జైలు శిక్ష 10 వేల జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.అదే ఎక్కువ మొత్తంలో దొరికితే 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది.సెక్షన్ 27 ప్రకారం కొకైన్, మార్ఫైన్, డయాసైటైల్మోర్ఫిన్, ఇతర నార్కొటిక్ డ్రగ్, సైకోట్రోపిక్ వినియోగించినట్లయితే ఏడాది పాటు కఠిన కారాగారం, 20 వేల జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.
మరి ఇందులో షారుక్ ఖాన్ తనయుడు ఏ సెక్షన్ కింద నిరూపణ అయితాడు ఏ విధమైనటువంటి శిక్ష పడుతుందో తెలియాల్సి ఉంది.