నితిన్( Nitin ), హీరోయిన్ శ్రీ లీలా ( Sri Leela )కలిసి నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్.( Robin Hood )ఈ సినిమా ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా భారీగా సక్సెస్ అవుతుందని అభిమానులు భావించారు.కానీ ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
ఇకపోతే ఈ సినిమాలోని అదిదా సర్ప్రైజ్ సాంగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ సాంగ్ పై ఎన్ని విమర్శలు నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ వచ్చాయో మనందరికీ తెలిసిందే.
ముఖ్యంగా మహిళల నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చాయి.

అయితే ఈ సినిమాపై ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో అదే రేంజ్ లో ఆదరణ కూడా దక్కిందని చెప్పాలి.ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.ఇది ఇలా ఉంటే రాబిన్ హుడ్ సినిమాలోని ఈ ఫుల్ వీడియో సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా తాజాగా మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ ని తెలిపారు.
అదేమిటంటే అదిదా సర్ప్రైజ్ ఫుల్ వీడియో సాంగ్ ని సోమవారం రోజు విడుదల చేశారు మూవీ మేకర్స్.ఇందులో కేతిక శర్మ ( Ketika Sharma )సందడి చేసిన విషయం తెలిసిందే.
సాంగ్ కి తగ్గట్టు స్టెప్పులు వేసి బాగా ఆకట్టుకుంది.

తాజాగా విడుదల చేసిన ఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే స్టెప్స్ పై వ్యతిరేకత కారణంగా పలు మార్పులతో థియేటర్లలో ప్రదర్శించిన టీమ్ అదే వెర్షన్ ను ఇప్పుడు రిలీజ్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి ఈ ఫుల్ వీడియో సాంగ్ పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయో చూడాలి మరి.ఇకపోతే రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమాతో నితిన్ అలాగే శ్రీ లీల కెరియర్ లో మరో హిట్ సినిమా పడుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
కానీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులను బాగా మెప్పించాయి.ముఖ్యంగా అదిదా సర్ప్రైజ్ యూట్యూబ్ లో భారీగా వ్యూస్ ని సాధించిందని చెప్పవచ్చు.