ఆధార్ ఉపయోగంలో విప్లవాత్మక మార్పు.. కొత్త ఆధార్ మొబైల్ యాప్ విడుదల

ప్రస్తుతం ఆధార్ కార్డు (Aadhaar Card)భారతదేశ ప్రజల వ్యక్తిగత గుర్తింపుకు ప్రాథమిక ఆధారంగా మారింది.బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ కనెక్షన్లు, రేషన్ సేవలు ఇలా ప్రతి రంగంలోనూ ఆధార్ అనివార్యమైంది.

 Government Launches New Aadhaar Mobile App With Fac Id And Qr Code Verification-TeluguStop.com

అయితే, ఆధార్ కార్డును ఎక్కడికైనా తీసుకెళ్లడం, జిరాక్స్ కాపీలు అందించడం, కొన్ని సందర్భాల్లో ఆ కార్డు పోయే సమస్యలు భాదిస్తూనే ఉన్నాయి.ఈ సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త డిజిటల్ ఆధార్ మొబైల్ యాప్‌ను(Digital Aadhaar mobile app) పరిచయం చేసింది.

ఈ ఆధార్ యాప్‌ను మంగళవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు.ఆధార్ వివరాలను డిజిటల్ రూపంలో సురక్షితంగా, సులభంగా పంచుకునే విధంగా ఈ యాప్ రూపొందించబడింది.ఈ యాప్ (APP)ప్రధానంగా ఆధార్ గోప్యతను పెంపొందించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు.ఈ మంచి యాప్ ఫీచర్లను మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా వివరించారు.ఈ యాప్‌లో క్యూఆర్ కోడ్ ఆధారిత (QR code based in the app)తక్షణ ధృవీకరణ, రియల్ టైం ఫేస్ ఐడి ఆథెంటికేషన్ వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.ఎవరైనా ఆధార్ తనిఖీ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, యాప్ ద్వారా చక్కగా ధృవీకరించవచ్చు.

ఇది యూపీఐ పేమెంట్స్(UPI {Payments) లో క్యూఆర్ స్కాన్ చేసిన విధంగా సులభంగా పూర్తవుతుంది.

ఈ యాప్ ఫోన్‌లో ఉండడం ద్వారా ఆధార్ కార్డు లేదా దాని జిరాక్స్ కాపీలను కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు.హోటల్స్, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు, చెక్‌పోస్టుల(Hotels, shopping malls, airports, checkpoints) వద్ద ఆధార్ చూపించాల్సిన సందర్భాల్లో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది.యాప్‌లోని ఫేస్ ఐడి ఫీచర్ ద్వారా వ్యక్తిగత గుర్తింపును నిర్ధారించవచ్చు.

ప్రస్తుతం ఈ ఆధార్ మొబైల్ యాప్ బీటా వెర్షన్ లో టెస్టింగ్ దశలో ఉంది.దీన్ని త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.

ఆధార్ వ్యవస్థను మరింత డిజిటల్, గోప్యమైనదిగా మార్చే దిశగా ఈ యాప్ ఓ కీలక అడుగుగా నిలుస్తోంది.భవిష్యత్‌లో ఆధార్ వినియోగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా డౌన్లోడ్ చేసి సేవలను ఉపయోగించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube