కేవలం ఒకే ఒక్క గ్లింప్స్ తో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Power Star Ram Charan).సరైన సూపర్ హిట్ మూవీ తో రాబోతున్నాను అని తెలిపారు.
అయితే తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun)కూడా సినిమా గ్లింప్స్ తో ఎలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇవ్వబోతున్నాడో చెప్పేసాడు.యంగ్ హీరోలు ఇలాగే ఉండాలి.
కెరీర్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడాలి.మంచి మంచి సినిమాలు అందించాలి.
టాప్ హీరోలందరి నడుమ కనిపించని పోటీ నడుస్తోంది.సరైన లైనప్ కోసం ఎవరి ప్లానింగ్ వారిది.
ఎవరి ప్రయత్నాలు వారివి.
అలా ప్లాన్ చేసిన సినిమాలకు సరైన బజ్ వచ్చేలా జనాల్లోకి హింట్ కంటెంట్ ఇవ్వడం కూడా ఒక ఆర్ట్ గా మారిపోయింది ఇప్పుడు.
కాగా ఇప్పటికే రామ్ చరణ్(Ram Charan) నుంచి అలాంటి కంటెంట్ వచ్చిన విషయం తెలిసిందే.బన్నీ నుంచి వచ్చింది.అయితే ఇప్పుడు రావాల్సింది అసలు సిసలు కంటెంట్ మహేష్ రాజమౌళి నుంచి రావాలి.కానీ అది ఇప్పుట్లో వస్తుందని అనుకోవడానికి లేదు.
ఎందుకంటే రాజమౌళి(Rajamouli) స్టయిల్ వేరు.అయితే ఎన్టీఆర్ నుంచి కూడా రావాల్సి వుంది.
వార్ 2 (War 2)సంగతి పక్కన పెడితే ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఇలాంటి వీడియో బైట్ రావాలి.
సోషల్ మీడియా మామూలుగా ఊగిపోదు అప్పుడు.
ఫ్యాన్స్ కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నారు.ప్రభాస్ కు ఇలాంటివి అక్కర్లేదు.
ఎందుకంటే ఆయన అలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతారు.ఈ అనౌన్స్ మెంట్ లు అలాంటివి పట్టించుకోరు.
అందువల్ల ఇప్పుడు వెయింటింగ్ అంతా ముందుగా ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ కోసమే.మరి ఎన్టీఆర్, మహేష్(ntr, mahesh) నుంచి ఎప్పుడు సరైన అప్డేట్ వస్తుందో చూడాలి మరి.అందుకోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైంటింగ్ గా ఎదురు చూస్తున్నారు.