బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్ది.( Peddi Movie ) ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
విడుదల చేసింది చిన్న టీజర్ అయినప్పటికీ ఈ టీజర్ పెద్ద రచ్చని క్రియేట్ చేసిందని చెప్పాలి.ఈ టీజర్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.
అంతే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది వ్యూస్ పరంగా కూడా రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు రీల్స్ లోనూ వేగంగా యూత్ కి పాకేస్తోంది.అయితే అందరూ అనుకున్నట్టు ఇది క్రికెట్( Cricket ) ని ప్రధాన అంశంగా రూపుదిద్దుకుంటున్న కథ కాదట.

గతంలో ప్రచారం జరిగినట్టు ఈ ఆటతో పాటు కుస్తీ( Wrestling ) చాలా కీలకంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.ఈ ఎపిసోడ్స్ లో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫైట్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ఇన్ సైడ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది.అయితేఇప్పటిదాకా షూట్ చేసింది కొంచెం అటు ఇటుగా ముప్పై శాతం మాత్రమేనట.ఇంతోటి దానికే దర్శకుడు బుచ్చిబాబు ఇన్ని ఎలివేషన్లు ఇస్తే మొత్తం కంటెంట్ లో ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
లగాన్ తరహాలో క్రికెట్ ని ఎమోషన్, యాక్షన్ తో ముడిపెడుతూ తనదైన మార్కు హీరోయిజంతో రామ్ చరణ్ పండించే సన్నివేశాలు చాలానే ఉన్నాయట.అలాగే జగపతిబాబు, దివ్యెందులు ఉన్న సీన్లు మరింత కీలకంగా ఉండబోతున్నాయట.

సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్రికెట్ కుస్తీతో పాటు మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఆడియన్స్ కి షాక్ ఇవ్వడం ఖాయమని టాక్.కాబట్టి ఫ్యాన్స్ ఇప్పుడప్పుడే రిలాక్స్ అవ్వడానికి లేదు.ఇంకా ఏడాది సమయం ఉండగానే పెద్దికి ఈ స్థాయిలో హైప్ రావడం బిజినెస్ పరంగా ఉపయోగపడుతోంది.అగ్రిమెంట్లు ఇప్పుడప్పుడే క్లోజ్ చేసేందుకు మైత్రి, వృద్ధి నిర్మాతలు సుముఖంగా లేరట.
ఇంకో నాలుగైదు నెలల తర్వాత అడ్వాన్సుల గురించి మాట్లాడుకుందామని బయ్యర్లకు చెప్పినట్టు తెలిసింది.ప్రస్తుతం పెద్ది సినిమాకు సంబంధించి ఇన్సైడ్ వినిపిస్తున్న వార్తలు అలాగే ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఖాయం అని తెలుస్తోంది.