చిరంజీవి విశ్వంభర మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఈసారి ఆ నెలను టార్గెట్ చేశారా?

టాలీవుడ్ డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి (Director Vasishta, Megastar Chiranjeevi)కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా విశ్వంభర(vishwambara).ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావాల్సి ఉంది.

 Vishwambara June 24 Release Date, Vishwambara, Vishwambara Movie, Tollywood, Chi-TeluguStop.com

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల చేయని వాయిదా వేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే మెగాస్టార్ చిరంజీవికి అలాగే చిత్ర యూనిట్ కి ఈ సినిమాకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక ప్రశ్న ఎదురవుతోంది.

అది ఈ సినిమా ఎప్పుడు వస్తుందని, చిరకాలంగా టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రశ్న కూడా ఇదే.ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ పై అనేక రకాల వార్తలు వినిపించాయి.కానీ ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.జూలై 24న న విశ్వంభర విడుదలకు (vishwambara june 24 release )సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇంద్ర రిలీజ్ డేట్.విశ్వంభర సినిమాను యువి సంస్థ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.

దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఖర్చు.ఫస్ట్ గ్లింప్స్ గ్రాఫిక్స్ సరిగ్గా రాకపోవడంతో, ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది.

దాంతో బోలెడు గ్యాసిప్ లు.వివి వినాయక్ (VV Vinayak)ఎంటర్ అయ్యారు.

Telugu Chiranjeevi, Tollywood, Vishwambara, Vv Vinayak-Movie

కొంత ఆయన కూడా వర్క్ చేసారని కూడా వార్తలు వినిపించాయి.మరోవైపు నాన్ థియేటర్ అమ్మకాల మీద అనుకున్న రేట్లు రాలేదనే టాక్ వినిపించింది.మరి ఇప్పటికీ అమ్మకాలు ఏ మేరకు జరిగాయో ఇంకా తెలియదు కానీ, విడుదల డేట్ మాత్రం ఫిక్స్ చేసారని తెలుస్తోంది.జూలై 24న విడుదల అంటూ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ నెల అనగా ఏప్రిల్ 12న ఫస్ట్ సాంగ్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.ఈ పాట రాముడి మీద వుంటే భక్తి పాట.అందుకే కృష్ణా జిల్లా నందిగామ దగ్గర వున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఈ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.కీరవాణి స్వరకల్పన చేసిన ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందని మూవీ మేకర్లు నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube