కీర్తి భట్ (Keerthi Bhat)తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు.తెలుగు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి అనంతరం బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమం తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం పలు సీరియల్స్ అలాగే బుల్లితెర కార్యక్రమాలు అంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా కీర్తి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఒక రోడ్డు ప్రమాదంలో తన కుటుంబ సభ్యులందరినీ కూడా కీర్తి కోల్పోయిన విషయం తెలిసిందే.ఇక బంధువులు ఆస్తి కోసం తనని బయటకు నెట్టేసారని పలు సందర్భాలలో తెలిపారు.ఇలా స్నేహితుల సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చిన నేను ఒక అబ్బాయి ప్రేమలో పడ్డాను.
అయితే ఆ అబ్బాయిని ప్రేమిస్తున్న నాలుగో నెలలోనే తన నిజస్వరూపం బయటపడింది.ఒక కార్యక్రమానికి ఇతర హీరోతో కలిసి నేను వెళ్ళాలి అంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి అందుకు ఒప్పుకోడు.
ఇలా ఏదైనా షోలో కలిసి నటిస్తే చాలు అనుమానం పడేవారు.

ఇండస్ట్రీలో ఉన్న తర్వాత కలిసిమెలిసి నటించడం డాన్స్ లు చేయడం వంటివి సర్వసాధారణం కానీ నేను ఎవరితోనైనా డాన్స్ చేసిన అనుమాన పడేవారు.ఇక నేను బిగ్ బాస్ వెళ్లే ముందు ఒక పాపను దత్తత తీసుకొని పెంచుకున్నాను.అయితే నేను బిగ్ బాస్ వెళ్లిన తర్వాత పాప చనిపోయింది.
అయితే ఆ పాప నా పాపేనని డిఎన్ఏ టెస్ట్ చేయించాలని పట్టుపడ్డారు.యాక్సిడెంట్లో గర్భసంచినే కోల్పోయిన నాకు పిల్లలు పుట్టరు.
అలాంటిది డిఎన్ఏ టెస్ట్ ఎలా చేయించగలను అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇలా ఆ వ్యక్తి శాడిజం కారణంగా తనకు బ్రేకప్ చెప్పిన కీర్తి ప్రస్తుతం నటుడు విజయ్ కార్తీక్‌ను (Vijay Karthik) పెళ్లాడబోతున్నారు.
ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.