నాకు కుల పిచ్చి ఉంది... నా కులం అదే... శ్రీకాంత్ అయ్యంగార్ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల కాలంలో క్యాస్ట్ ఫీలింగ్(Caste Feeling) అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.ఏ విషయంలో నైనా ప్రతి ఒక్కరు ఇలా క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తూ ఉన్నారు.

 Sreekanth Ayyangar Sensational Comments On Caste , Sreekanth Ayyangar,caste Feel-TeluguStop.com

అయితే తాజాగా నటుడు సైతం ఇలా కులం గురించి నాకు కుల పిచ్చి ఉంది అంటూ మాట్లాడటంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ అయ్యాంగార్ (Sreekanth Ayyangaar)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.అలాగే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

నిత్యం ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయాలు గురించి కూడా మాట్లాడుతూ శ్రీకాంత్ వార్తల్లో నిలుస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈయన కులం గురించి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.చాలామంది ప్రతి రోజు కులం గురించి ప్రశ్నలు వేస్తున్నారు.ఈ ఫ్రస్టేషన్ తట్టుకోలేక తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.క్యాస్ట్ ఫీలింగ్ జిందాబాద్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో భాగంగా ఈయన మాట్లాడుతూ… చాలామంది మీ కులం ఏంటి? మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అంటూ తరచూ ప్రశ్నలు వేస్తున్నారు.నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది.కులం ఫీలింగ్ ఉంది.

నా కులం సింగిల్స్(Singles) కులం.సింగిల్స్‌గా ఉన్న అందరూ నా అన్నాదమ్ములే.

జై సింగిల్.సింగిల్ రాక్స్.

అంతే అంటూ తన కులం గురించి క్లారిటీ ఇచ్చారు దీనితో నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.అన్న నేను కూడా సింగిల్ .నాది కూడా నీ కులమే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

https://x.com/Shri__Bharat/status/1908936405583036471?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1908936405583036471%7Ctwgr%5Ebef4ee5dab2a1b38d0690560b70c51ec14fa18ed%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube