శ్రీ వేంకటేశ్వర స్వామిని బాలాజీ అని ఎందుకు పిలుస్తారు?

మనం వేంకటేశ్వర స్వామిని బాలాజీ అని కూడా పిలుస్తాం.తిరుమల తిరుపతిలో ఉండే స్వామిని ఎక్కువగా శ్రీవారు అంటూ.

 What Is The Reason Behind We Are Calling Balaji To Venkateshwara Swamy, Balaji ,-TeluguStop.com

హైదరాబాద్ లోని చిలుకూరులో ఉండే వేంకటేశ్వరుడిని బాలాజీ అని పిలుస్తుంటాం.అసలు వేంకటేశ్వర స్వామికి బాలాజీ అనే పేరు ఎవరు, ఎందుకు పెట్టారు.

మనం ఇప్పటికీ అలాగే పిలవడానికి కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ వేంకటేశ్వర స్వామిని తొలి రోజుల్లో అరణ్యాలలోని శబరులు శక్తి స్వరూపిణిగి ఆరాధించారు.

అయితే ఇప్పటికి కూడా వేంకటేశ్వర స్వామి విగ్రహానికి వెనుక స్త్రీల ముడి వంటి ముడి ఉన్నదని కొందరు చెబుతుంటారు.కనుక ఆమెను బాల త్రిపుర సుందరిగా భావించారు.

వైష్ణవ ఆలయాల్లో ఎక్కడా లేని విధంగా దసరా పండుగకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం.దేవాలయంపై అమ్మవారి వాహనమైన సింహాల బొమ్మలు నలువైపులై ఉండటం వంటివి ఆ వివాదానికి బలం చేకూర్చాయి.

దసరా శక్త్యారాదన పర్వం కాబట్టి బాల త్రిపుర సుందరీ దేవి నామాన్ని భక్తులు ముద్దుగా బాల అని అంటారు.అందువల్ల ఔత్త రాహులు బాలాజీ అని అంటారు.

రామానుజుల వారు వచ్చి ఆయన విష్ణువని ప్రతిపాదించి నిర్థరించక ముందు స్వామికి ఆరుమాసాలు శివ పూజ, ఆరు మాసాలు విష్ణు పూజ చేసేవారు.అయితే ఆ తర్వాత రామానుజల చార్యులు వచ్చి విష్ణువు అని నిర్దారిస్తాడు.

అప్పటి నుంచి వేంకటేశ్వర స్వామికి పూజలు జరిపిస్తూనే.గతంలో పిలుచుకున్నట్లుగా బాలాజీ అని పిలిచేవాళ్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube