ఈ సంవత్సరం హోలీ రోజున మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడింది.అలాగే ఏప్రిల్ నెలలో మొదటి సూర్యగ్రహణం( Solar eclipse ) రాబోతూ ఉంది.
ఈ సూర్యగ్రహణం సరిగ్గా ఉగాదికి ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో సంభవిస్తుంది.సనాతన ధర్మం లో సూర్యగ్రహణం ఎంతో ముఖ్యమైనది.
మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8, 9 వ తేదీల మధ్య రాత్రి ఏర్పడబోతోంది.ఈ గ్రహణం 8వ తేదీ రాత్రి 9 గంటల 12 నిమిషములకు మొదలై మధ్యాహ్నం రెండు గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది.

అలాగే గ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం మొదలవుతుంది.అయితే చంద్రగ్రహణం మాదిరి ఈ సూర్యగ్రహణం కూడా మన దేశంలో కనిపించదు.దీని కారణంగా భారతదేశంలో గ్రహణం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.ఈ సంవత్సరం చైత్ర అమావాస్య ( Chaitra Amavasya )ఏప్రిల్ 8న, చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9న మొదలవుతున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.గ్రహణ సమయంలో రాహు కేతువుల ప్రభావం అధికంగా ఉంటుంది.కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.

ఈ సూర్యగ్రహణం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.వృషభ, మిధున, సింహ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.కానీ మేష, తులా, కుంభ రాశుల( Mesha Rasi ) వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.అలాగే ఈ సూర్యగ్రహణం మెక్సికో మీదుగా అమెరికా, కెనడా( America, Canada )లో కనిపిస్తుంది.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదు.గ్రహణ సమయంలో భగవంతుడిని తలుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
సూర్య గ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడం మంచిది.సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష కళ్ళతో చూడకూడదని గుర్తుపెట్టుకోవాలి.
ముఖ్యంగా చెప్పాలంటే సూర్యగ్రహణం భారత దేశంలో కనీపించదు.కాబట్టి ఈ గ్రహణం నియమాలు మన దేశంలో వర్తించవు.