ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో( IPL ) ప్రతి టీం తమ సత్తాను చాటుకోవడానికి సిద్ధమయ్యారు.ఇక అందులో భాగంగానే మొదటి మ్యాచ్ చెన్నైకి బెంగళూరు జట్ల మధ్య జరగబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ మ్యాచ్ తర్వాత రెండో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్( Sun Risers Hyderabad ) వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్( Kolkata Knight Riders ) టీం లా మధ్య జరగనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ గెలిచి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ మ్యాచ్ తో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తే తప్ప హైదరాబాద్ టీమ్ మళ్ళీ లైమ్ లైట్లోకి అయితే రాదు.
అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ గెలవాలంటే ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్ లాంటి ప్లేయర్లు రాణించక తప్పదు.ఇక వీళ్లు కనుక అద్భుతమైన బ్యాటింగ్ తీరును కనబరిస్తే తప్ప హైదరాబాద్ టీమ్ అయితే ఈ మ్యాచ్ ను గెలువ లేరు.ఆ టీం కి రెండుసార్లు కప్పును అందించిన గౌతమ్ గంభీర్( Gautam Gambhir ) ఈసారి కలకత్తా టీమ్ కి మెంటరీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక శ్రేయాస్ అయ్యర్( Shreyas Iyer ) సారథ్యం లో బరిలోకి దిగుతున్న కలకత్తా ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యం గా భారీ వ్యూహాలతో బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక వాళ్ళ ఎత్తులకు పైఎత్తులు వేస్తేనే కమ్మిన్స్ సేన ఈ మ్యాచ్ ను గెలిచే అవకాశాలైతే ఉంటాయి.లేకపోతే మాత్రం ఈ మ్యాచ్ ను చేజేతులారా ఓడిపోవాల్సి వస్తుంది.
అలాగే కమ్మిన్స్( Cummins ) కూడా బౌలింగ్ లో అత్యుత్తమమైన పర్ఫామెన్స్ ఇవ్వాలి.ఇక ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్లు రానించాలి.అలాగే ఉమ్రాన్ మాలిక్ కూడా మరోసారి తన పేస్ బౌలింగ్ లో స్టామినాను చూపిస్తే తప్ప ఈ మ్యాచ్ అయితే హైదరాబాద్ చేతిలోకి రాదు.ఇక మొదటి మ్యాచ్ లో గెలిచి సత్తా చాటుకుంటే హైదరాబాద్ టీమ్ కి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు.
చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు ఎవరిపైన పైచేయి సాధిస్తారు అనేది…
.