Rashi Khanna : రాశి ఖన్నా గురించి ఎవరికి తెలియని విషయం ఏంటో తెలుసా ?

ఊహలు గుసగుసలాడే( Oohalu Gusagusalade ) అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి కన్నా( Rashi khanna ).ఆ తర్వాత తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది.

 Rashi Khanna : రాశి ఖన్నా గురించి ఎవరి-TeluguStop.com

ఢిల్లీలో పుట్టి పెరిగిన రాశి కన్నా మొట్ట మొదటి సారిగా 2013లో ఒక హిందీ సినిమాలో సపోర్టింగ్ పాత్రలో నటించింది.ఆ తర్వాత 2014లోతెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood )కి పరిచయమైంది.

ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా ఆమెకు మంచి పేరు లభించింది.ఇప్పటి వరకు తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో కలిఫై 30కి పైగా సినిమాలు నటించింది రాశి.

అయితే రాశి కన్నా గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది.అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Telugu Bollywood, Rashi Khanna, Kollywood, Tollywood, Yodha-Movie

ఆమె ఏ సినిమా అయినా సరే అది చిన్నదో పెద్దదో సంబంధం లేకుండా ప్రతి సినిమా కోసం మొట్టమొదటిగా తనను ఆడిషన్ చేయమని ఆ చిత్ర బృందానికి సూచిస్తుందట.మొదటి సినిమా నుంచి ఇప్పుడు నటిస్తున్న అన్ని సినిమాల వరకు ఆమె ఇలాగే ఆడిషన్ ఇచ్చిన తర్వాతే నటిస్తుందట.ఎందుకంటే సినిమా ఏదైనా తాను ఆ పాత్రకు సూట్ అవుతానో లేదో అనే విషయం ఖచ్చితంగా దర్శకుడికి ఒక అంచనా రావాలి అని, అలా వస్తేనే తను ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానని రాశి కన్నా నమ్ముతుంది.అందుకే ఆమె నటించిన 30 సినిమాల్లో అలాగే ఇప్పుడు నటిస్తున్న యోధ అనే హిందీ సినిమా అన్నమనై, మేథావి అని రెండు తమిళ సినిమాల్లో కూడా ఆడిషన్ ఇచ్చిన తర్వాతే నటించడం జరిగిందట.

Telugu Bollywood, Rashi Khanna, Kollywood, Tollywood, Yodha-Movie

ఇక చాలామంది హీరోయిన్స్ కి రాశికి ఉన్న తేడా ఏంటంటే ఆమె నటించిన మొట్టమొదటి సినిమాకి బెస్ట్ గా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది.ఇక ఇటీవల ఆమె నటించిన పర్జీ అనే వెబ్ సిరీస్ లో ద్వారా ఆమెకు మంచి పేరు లభించింది.ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న రాశి తెలుగులో మాత్రం ఒక్క చిత్రంలో కూడా నటించక పోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube