ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆరోగ్యం సరిగా లేకపోతే ఎంత సంపద ఉన్నా వ్యర్థమే.అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్యమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.
అందుకు మీరు కచ్చితంగా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొట్టమొదట మీరు ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.మార్నింగ్ త్వరగా నిద్ర లేవాలి అంటే నైట్ త్వరగా పడుకోవాలి.నిద్రపోవడానికి కనీసం గంట ముందు నుంచి అన్ని రకాల గ్యాడ్జెట్స్ ను ఎవైడ్ చేయాలి.నిత్యం ఆయిల్ పుల్లింగ్ చేయాలి.తద్వారా నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.దంతాలు తెల్లగా మారతాయి.
మరియు ఆయిల్ పుల్లింగ్ వల్ల డిటాక్సిఫికేషన్ కూడా అవుతుతుంది.టీ కాఫీ కి బదులు ప్రతిరోజు ఉదయం లెమన్ వాటర్( Lemon water ) తీసుకోవాలి.
లేదా ఏదో ఒక హెర్బల్ టీ ని సేవించాలి.ఎందుకంటే, ఇవి శరీరంలోకి పేరుకుపోయిన వ్యర్థలను బటయకు పంపుతాయి.
ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పని చేస్తాయి.నిత్యం ఉదయం అరగంట పాటు వ్యాయామం( Exercise ) చేయాలి.
వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.
ప్రతిరోజు ఒకే టైం లో తినడం అలవాటు చేసుకోవాలి.అలాగే తినే ఆహారాన్ని హడావిడిగా కాకుండా నెమ్మదిగా నమిలి తినాలి.
మధ్యాహ్న భోజనం సమయం వరకు నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్ జ్యూసులు వంటివి మాత్రమే తీసుకోవాలి.

భోజనాలకు మధ్య నిర్ణీత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా మెయిన్ మెయిల్స్ మధ్య కనీసం మూడున్నర గంటల సమయం ఉండేలా జాగ్రత్త పడాలి.భోజనం చేయడానికి అరగంట ముందు మరియు భోజనం చేసిన అరగంట తర్వాత వాటర్ తీసుకోవాలి.
భోజనంతో పాటు నీటిని తీసుకోకూడదు.ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు( Eggs ) వంటి పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.
అన్ హెల్తీ ఫుడ్ ను అవాయిడ్ చేయాలి.ఆఫీసులో లిఫ్ట్ వాడడానికి బదులుగా మెట్లను ఉపయోగించాలి.
రోజు ఉదయం సాయంత్రం మెట్లు దిగి ఎక్కడం వల్ల శరీరానికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది.రోజు నైట్ టైమ్ భోజనాన్ని త్వరగా ముగించాలి.
భోజనానికి నిద్రకు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.ఇక రోజులో కనీసం అర గంటైనా ఫ్యామిలీ మెంబర్స్ తో టైమ్ స్పెండ్ చేయడం అలవాటు చేసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.