బతుకమ్మ పేర్చడం బౌద్ధులు నేర్పించారా..తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ కు గల సంబంధం గురించి తెలుసా..?

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ బతుకమ్మను( Bathukamma ) ఒకేలా పేరుస్తూ ఉంటారు.కానీ చిన్న వ్యత్యాసం ఉంది అని పండితులు చెబుతున్నారు.

 How Does Bathukamma Is Linked With Telangana Culture And Tradition Details, Bat-TeluguStop.com

కొందరు శివలింగంలా పేరిస్తే మరికొందరు బౌద్ధ స్థూపాకారంలో పేరుస్తూ ఉంటారు.అసలు బతుకమ్మ పేర్చడం బౌద్ధుల నుంచే నేర్చుకున్నారని కొందరు చెబుతున్నారు.

దానికి సంబంధించిన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం రోజులలో బౌద్ధులు( Buddhists ) తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్థూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారు చేసేవారు.

ఎందుకంటే బౌద్ధ బిక్షులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల సమయానుకూలంగా స్తూపారాధనకు తమకు దొరికిన వస్తువులతో స్తూపాలను తయారు చేసుకొని బుద్ధునికి ప్రతికగా నమస్కరించేవారు.

Telugu Ambika, Bathukamma, Telangana-Latest News - Telugu

ఆరాధన తర్వాత స్తూపంలా పేర్చిన పూలు, ఇసుక, మట్టి, పేడను అలానే నీటిలో కలిపేసేవారు.అయితే వాళ్లు తిరుగాడిన ప్రదేశాల్లో ఎక్కువ ప్రవాహాలు, వాగులు తెలంగాణలోనే( Telangana ) ఉండేవి.ఆ సమయంలో బౌద్ధ బిక్షులు ఆచరించిన ఈ పద్ధతిని చూసి గిరిజనులు, వనాల్లో నివసించేవారు ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

అలా పూజించడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతారని చెబుతున్నారు.తర్వాత వచ్చిన మత పరిమాణాల వల్ల మన దేవతను బతుకమ్మగా చేసుకొని పూజించడం మొదలుపెట్టారు.ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజిస్తున్నారు.

Telugu Ambika, Bathukamma, Telangana-Latest News - Telugu

ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఆస్తిత్వం బతుకమ్మలో ఉంది అని ప్రజలు నమ్ముతారు.తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను( Bathukamma Festival ) దశాబ్దాలుగా జరుపుకుంటున్నారు.ఈ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

ముఖ్యంగా నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ మహిళల బతుకులు దుర్వారంగా ఉండేవి.వారి ఆకృత్యాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వారందరినీ తలుచుకొని ప్రతికగా పూలు పేర్చి బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.

అందుకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఉద్దేశంతో మధ్య మధ్యలో గౌరమ్మను పెట్టి పూజిస్తూ ఉండేవారు.అలా పసుపు గౌరమ్మను ఉంచడమే బతుకమ్మ అని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube