కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులు ఇబ్బంది పెడుతున్నాయి.ఈ క్రమంలో ఆయన ఇవాళ పాట్నా కోర్టు ఎదుట హాజరుకానున్నారు.
మోదీ ఇంటి పేరుపై 2019వ సంవత్సరంలో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బీజేపీ నేత సుశీల్ మోదీ పరువు నష్టం దావా ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు నోటీసులు జారీ చేసింది.
గత నెలలో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ ట్రయల్ కోర్టు.అయితే ఈ తీర్పుపై రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
సెషన్స్ కోర్టులో విచారణకి ముందు పాట్నా కోర్టులో పరువునష్టం కేసు విచారణ జరగనుంది.అదేవిధంగా ట్రయల్ కోర్టు తీర్పుపై మే 3వ తేదీన సూరత్ సెషన్స్ కోర్టు విచారణ చేయనుంది.







