రాత్రి భోజనానికి బరువు పెరగడానికి ఏం సంబంధం ఉందో తెలుసా..?

ప్రస్తుత సమాజంలో ప్రజలు అనుభవిస్తున్న అతిపెద్ద సమస్యలలో ఊబకాయం( Obesity ) ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.అనేకమంది ఉండాల్సిన దానికన్నా అధిక బరువు పెరుగుతున్నారు.

 Avoid These Mistakes During Dinner To Lose Weight Details, , Dinner ,lose Weight-TeluguStop.com

ఇది వ్యక్తుల జీవనశైలి, నిద్ర, విధానాలు తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.ఒకసారి బరువు పెరిగితే దానిని అదుపు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

సాధారణంగా బరువు అదుపు చేయడానికి అందరూ ఉదయం సమయంలో అల్పాహారం సక్రమంగా తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు.కానీ మీరు చేసే రాత్రి భోజనం( Dinner ) శరీర బరువుపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతోందని చాలామందికి తెలియదు.

Telugu Dietary Fiber, Tips, Lose, Obesity, Protein Fiber, Salads Soups, Vegetabl

ఇప్పుడు రాత్రి సమయంలో ఏం తినాలి.ఏం తినకూడదు.ఎంత తినాలి.ఏ సమయంలో తినాలి.ఏంటి అని అనుమానాలు సందేహాలు చాలా మందిలో ఉంటాయి.ఈ నేపథ్యంలో సాధారణంగా చాలామంది రాత్రి ఆహారం విషయంలో చేసే తప్పులు, వాటి వల్ల కలిగే నష్టాలు, నివారణ పద్ధతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి భోజనాన్ని వీలైనంతవరకు లైట్ గా ఉండడమే మంచిది.వాస్తవానికి రోజు కరిగే కొద్ది మన జీవక్రీయ మందగిస్తుంది.

నిజానికి జీవక్రియను ప్రోత్సహించే ప్రతి ఆహారం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.అందుకే రాత్రి భోజనంలో సలాడ్‌లు, సూప్‌లు లేదా కాల్చిన కూరగాయలు వంటి వాటిని తీసుకోవడం మంచిది.

Telugu Dietary Fiber, Tips, Lose, Obesity, Protein Fiber, Salads Soups, Vegetabl

ఇంకా చెప్పాలంటే రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల రాత్రి పూట ఎక్కువసేపు ఖాళీ కడుపుగా ఉంటుంది.ఇది కొవ్వు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.మీకు ఆరోగ్యకరమైన వాటిని రాత్రి సమయంలో ఆహారంగా తీసుకోవాలి.అధిక కేలరీలు( Calories ) ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరిగేందుకు కారణం అవుతుంది.అలాగే సులభంగా బరువు తగ్గడానికి ప్రోటీన్, ఫైబర్ బాగా ఉపయోగపడతాయి.ఈ పోషకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవక్రియ మందగిస్తుంది.

ప్రోటీన్ ఫైబర్ రెండు మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి.ఇంకా చెప్పాలంటే రాత్రి పూట అధిక ఉప్పును అస్సలు తినకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube