నాన్ వెజ్ (Non Veg)లవర్స్ లో చాలామందికి మోస్ట్ ఫేవరెట్ చికెన్.పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్ ను తెగ ఇష్టంగా తింటూ ఉంటారు.
వారానికి ఒకటి రెండు సార్లు తినేవారు కొందరైతే.రెగ్యులర్ గా చికెన్ తినేవారు (Chicken eaters)మరికొందరు.
ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వల్ల బాడీ బిల్డింగ్, మాస్ గెయిన్, ఫిట్‌నెస్ మెయింటెన్స్‌కి చికెన్ బాగా ఉపయోగపడుతుంది.అయితే తరచూ చికెన్ తినేవారు ప్రస్తుత సమ్మర్ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
చికెన్ హీటింగ్ ఫుడ్‌గా పరిగణించబడుతుంది.అందువల్ల వేసవి కాలంలో చికెన్ ఎక్కువగా తింటే ఒంటిలో వేడి పెరిగి హీట్ ర్యాషెస్, నోటిలో అల్సర్లు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
అలాగే చికెన్ తో తయారు చేసే వంటకాల్లో ఎక్కువ మసాలా మరియు ఉప్పును వినియోగిస్తాయి.ఎక్కువ మసాలా మరియు ఉప్పు కలిగిన చికెన్ తింటే డీహైడ్రేషన్ బారిన పడతారు.
పైగా ఎండల్లో నీరు తక్కువగా తాగితే ఈ సమస్య మరింత పెరుగుతుంది.

పొట్టకు భారంగా అనిపించే చికెన్ (Chicken)ను వేసవి కాలంలో తినడం వల్ల ఒత్తిడి, అలసటకు దారితీయవచ్చు.వేసవిలో సహజంగానే జీర్ణక్రియ మందగిస్తుంది.ఎక్కువ మసాలా, ఆయిల్, ఫ్రై చేసిన చికెన్ తింటే అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అలాగే సమ్మర్ సీజన్ లో ఆహారం త్వరగా పాడైపోతుంది.కాబట్టి సరిగ్గా ఉడకని లేదా నిల్వ చేసిన చికెన్‌లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.అటువంటి చికెన్ ను తింటే డయేరియా, వాంతులు, జ్వరం వంటి సమస్యలు రావచ్చు.

కాబట్టి నాన్ వెజ్ ప్రియులు సమ్మర్ లో చికెన్ ను వీలైనంత వరకు ఎవైడ్ చేయడం ఎంతో ఉత్తమం.ఒకవేళ తినాలి అనుకుంటే చికెన్ ను తక్కువ మసాలా, తక్కువ ఆయిల్ వేసి వండుకోవాలి.గ్రిల్, బాయిల్డ్, స్టీమ్‌డ్ చికెన్ లాంటి తేలికపాటి వంటకాలు తినాలి.
చికెన్ ను పొరపాటున కూడా నిల్వ చేసి తీసుకోకూడదు.తాజాగా ఉండేలా చూసుకోవాలి.
అలాగే రోజుకు ఒకపూట మాత్రమే తినాలి.చికెన్ తిన్నప్పుడు బాడీ హైడ్రేట్ గా ఉండేందుకు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.
ఒంట్లో వేడి తగ్గడానికి కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి సేవించాలి.







