ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో సీనియర్ నటులైన చిరంజీవి, బాలకృష్ణ ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే వాళ్లు తీసిన సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్లుగా మిగిలాయి.
ఇక ప్రస్తుతం ఇప్పుడు వీళ్లిద్దరూ వరుస సినిమాలను చేస్తూ కుర్ర హీరోలు సైతం పోటీని ఇస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో బాలయ్య బాబు వరుస హిట్లతో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) తో బాలయ్య ఒక హై ఓల్టేజ్ సినిమాని తీసి మంచి విజయాలను అందుకొని టాప్ హీరోగా తను ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి మాత్రం భోళా శంకర్ సినిమాతో ఒక ఫ్లాప్ ని అందుకున్నాడు.అయితే వాల్తేరు వీరయ్య సినిమా రూపంలో 250 కోట్ల వసూళ్లను సాధించిన చిరంజీవి ఆ తర్వాత తీసిన భోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో మాత్రం చాలా వరకు డీలా పడ్డాడు అనే చెప్పాలి.ఇక ఈ టైంలో బాలయ్య బాబు వరుసగా మూడు హిట్లు కొట్టడంతో వీళ్లిద్దరి మధ్య పోటీ మళ్ళీ రసవత్తరంగా మారింది.
చిరంజీవి వశిష్ట డైరెక్షన్( Mallidi Vasishta ) లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా రాబోతుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలను చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ సీనియర్ హీరోల్లో చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్తాడు.ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్, నాగార్జున లను పక్కనపెడితే చిరంజీవి, బాలయ్య బాబు కి మధ్య పోటీ అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంది.ఇక ఈ క్రమం లోనే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయింది.
దాంతో ఇప్పుడు అందరూ బాలయ్య బాబు చేసినట్టు గా చిరంజీవి తన సినిమాలతో ఎందుకు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోతున్నాడు అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి.ఇక చిరంజీవి వరుసగా రెండు మూడు హిట్లు కొడితే తప్ప ఆయన క్రేజ్ మళ్ళీ పెరగదు…