కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని చాలామంది భావిస్తారు.ఈ ప్రయత్నంలో కొంతమందికి పాజిటివ్ రిజల్ట్స్ దక్కితే మరికొందరికి షాకింగ్ ఫలితాలు ఎదురవుతాయి.
ఒకప్పుడు ఆత్మహత్యాయత్నం చేసిన ప్రాచీ రాథోడ్ ( Prachi Rathore )ప్రస్తుతం డాక్టర్ గా సేవలందిస్తున్నారు.ఆమె సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.
అదిలాబాద్ రిమ్స్ నుంచి పట్టా పొందిన ప్రాచీ రాథోడ్ ఉస్మానియా ఆస్పత్రిలో ఏఆర్టీ విభాగంలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు.
ప్రాచీ రాథోడ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.
ఒక న్యూస్ ఛానెల్ తో ప్రాచీ రాథోడ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.డాక్టర్ కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
జన జీవన స్రవంతిలో మేము కలిసి సాధారణ వ్యక్తులకు చికిత్స చేస్తామని ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చారు. హెచ్.
ఐ.వీ రోగులకు( HIV patients ) సంబంధించిన కేసులను నేను ఎక్కువగా డీల్ చేస్తానని ప్రాచీ రాథోడ్ పేర్కొన్నారు.
ఎంబీబీఎస్ ( MBBS )కు ముందు జనాలు ఎలా మాట్లాడినా తల్లీదండ్రుల సపోర్ట్ ఉండేదని ప్రాచీ రాథోడ్ ఆన్నారు.ఒకానొక సమయంలో బ్రతికి ఏం చేయాలని అనిపించిందని ఆమె వెల్లడించారు.వేధింపులు అయితే పీక్స్ లో ఉండేవని ఇంటర్ సమయంలో ఆత్మహత్యాయత్నం చేశానని ప్రాచీ రాథోడ్ అన్నారు.ఎంబీబీఎస్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆమె కామెంట్లు చేశారు.
లింగ వివక్షత వల్ల గతంలో తాను ఉద్యోగం కోల్పోయానని ఆమె కామెంట్లు చేశారు.రోగులకు సేవ చేయడం సంతోషాన్ని కలిగిస్తుందని ప్రాచీ రాథోడ్ అన్నారు.ఎంతోమంది రోగుల నుంచి ప్రశంసలు అందుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.నా కమ్యూనిటీ సపోర్ట్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని ప్రాచీ రాథోడ్ కామెంట్లు చేశారు.ప్రాచీ రాథోడ్ సక్సెస్ ఎంతోమందికి సంతోషాన్ని కలిగిస్తోంది.తన టాలెంట్ తో ఆమె ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.