అమెరికాలో( America ) అక్రమంగా నివసిస్తున్నందుకు గాను బహిష్కరణను ఎదుర్కొంటున్న దాదాపు 18 వేల మంది భారతీయ పౌరుల( Indian Citizens ) పత్రాలను భారత్ ధృవీకరించింది.ఈ జాబితాను అమెరికా ప్రభుత్వంతోనూ పంచుకుందని వార్తలు వస్తున్నాయి.
అమెరికా నుంచి అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ప్రభుత్వం.దీంతోత దాదాపు 18 వేల మంది భారతీయులను తిరిగి వారిని స్వదేశానికి పంపించే విషయాన్ని అధికారికంగా చేపట్టింది.
అమెరికాలో అక్రమ వలసదారుల కేసులు ఎక్కువగా ఉండటంతో బహిష్కరణల సంఖ్య ప్రస్తుతం 2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.అమెరికాకు అక్రమంగా వెళ్లిన భారతీయుల్లో పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
భారతదేశంలో వెరిఫికేషన్ , బహిష్కరణ నిరంతర ప్రక్రియ అని.ఇండియా ఎప్పుడూ అక్రమ వలసలకు( Illegal Migrants ) మద్దతు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఎవరైనా భారతీయుడు అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు తేలితే.వారి పత్రాలు సక్రమంగా ఉంటే వారి బహిష్కరణను అంగీకరిస్తామన్నారు.
మంగళవారం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌తో( EAM S Jaishankar ) జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో( Marco Rubio ) ఈ అక్రమ వలసల అంశాన్ని ప్రస్తావించారు.ఆర్ధిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.అలాగే అక్రమ వలసలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించాలని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం తరపున రూబియో తెలిపారు.
అక్రమ వలసదారులను స్వీకరించడంలో భారతదేశం వైపు నుంచి ఏదైనా సమస్యలు వస్తే అది చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే భారతీయులపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గతంలో అమెరికాకు ఢిల్లీ అన్ని రకాలుగా అండగా నిలవడంతో విద్యార్ధి వీసా, హెచ్ 1 బీ వీసాలు పెద్ద సంఖ్యలో భారతీయులకు మంజూరయ్యాయి.అధికారిక గణాంకాల ప్రకారం.2023లో మంజూరు చేయబడిన 3,86,000 హెచ్ 1 బీ వీసాలలో మూడొంతుల మంది భారతీయులకే దక్కాయి.