సాధారణంగా కారు, బైకుల్లో పంక్షర్ అయితే ఐరన్ జాకీ లేదా ఇతర సాధనాలతో టైరు మార్చడం చూస్తుంటాం.కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇద్దరు వ్యక్తులు కారు టైరును( Car Tire ) వినూత్నంగా మార్చడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఇకపోతే, ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో కారు పంక్షర్ కావడంతో టైరు మార్చాల్సిన అవసరం వచ్చింది.అయితే, టైరు మార్చడానికి సాధారణ పద్ధతిని ఉపయోగించకుండా వారు కాస్త వినూత్నంగా ప్రయత్నించారు.
వారిలో ఒకరు టైరు మార్చేందుకు సిద్దమవ్వగా.మరో వ్యక్తి కారును( Car ) భుజాలపై ఎత్తుకుని పైకి లిఫ్ట్ చేశారు.
అలా అతను కారును భుజాలపై మోస్తున్నంతసేపు, రెండో వ్యక్తి సులభంగా పంక్షర్( Puncture ) అయిన టైరు మార్చి సెట్ చేశాడు.టైరును పూర్తిగా మార్చేవరకు మొదటి వ్యక్తి కారును భుజాలపై పట్టుకున్నాడు.ఈ పరిణామం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వివిధ రకాలుగా వ్యక్తం చేస్తున్నారు.అతడేమైనా రియల్ బాహుబలి( Real Baahubali ) అనుకుంటున్నాడు.ఏమైనా ఎలా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.
మరికొందరేమో, ఇది మామూలు టాలెంట్ కాదయ్య అంటూ ఎమోజీల రూపంలో కూడా కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోకు ప్రస్తుతం వేల సంఖ్యలో లైక్‌లు, లక్షలలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.ఇలాంటి విచిత్ర విన్యాసాలు కేవలం ఆకట్టుకోవడమే కాదు, నెటిజన్లను విభిన్నంగా ఆలోచించేసేలా చేస్తాయి.అయితే, ఈ విధమైన విన్యాసాలు చేయడం ప్రమాదకరం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాంటి చర్యలకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఇంకెందుకు ఆలశ్యం ఈ వీడియో చూసి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.