ఇంగ్లాండ్( England ) జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా( Team India ) శుభారంభం చేసింది.బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అదరగొట్టింది.మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది.
టీమిండియా బౌలర్లు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, పేసర్లు అర్ష్ దీప్ సింగ్, హార్ధిక్ పాండ్య అద్భుతంగా రాణించారు.దానితో ఇంగ్లాండ్ బ్యాటర్లను నిలువరించారు.
ఫలితంగా ఇంగ్లాండ్ జట్టుకు భారీ స్కోర్ చేయడం కష్టమైంది.
ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన టీమిండియా ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ( Abhishek Sharma ) దడదడ లాడించాడు.క్రీజులోకి వచ్చిన వెంటనే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన అభిషేక్, కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.చివరికి 34 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సహాయంతో 79 పరుగులు చేసాడు.
ఈ క్రమంలో అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్‌తో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్( Yuvraj Singh ) రికార్డులను బద్దలు కొట్టాడు.
ఇందులో ఒకటి ఇంగ్లాండ్‌పై టీ20 ఫార్మాట్‌లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రెండో వేగవంతమైన భారత ఆటగాడిగా నిలిచాడు.అలాగే ఇంగ్లాండ్‌పై టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (8) కొట్టిన ఆటగాడిగా మరో రికార్డ్ సృష్టించాడు.2007లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్‌పై ఆరు సిక్సర్లు కొట్టగా, 2022లో సూర్యకుమార్ యాదవ్( Suryakumar Yadav ) కూడా 6 సిక్సర్లు సాధించాడు.కానీ, అభిషేక్ శర్మ ఎనిమిది సిక్సర్లతో వారిని అధిగమించాడు.భారత్ అన్ని విభాగాల్లో రాణించి మ్యాచ్‌ను సునాయాసంగా గెలిచింది.బౌలర్ల సమష్టి కృషి, అభిషేక్ శర్మ అత్యుత్తమ బ్యాటింగ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను విజయంతో ఆరంభించింది.