కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) .మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు అనంతరం తెలుగులో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇలా తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న నటించిన ప్రతి సినిమా కూడా సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో తిరుగు లేకుండా పోయింది.ఇక తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప( Pushpa ) సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా మంచి విజయం కావడంతో రష్మిక కెరియర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు.ఈ సినిమా తర్వాత ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చాయి.దీంతో వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు మరోవైపు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల బాలీవుడ్ చిత్రం యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న రష్మిక త్వరలోనే మరొక బాలీవుడ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ( Vicky Kaushal ) నటించిన హిస్టారికల్ సినిమా ‘ఛావా’( Chhaava ) .ఈ సినిమాలో విక్కీ కౌశల్ రాజు పాత్రలో కనిపించక మహారాణి ఏసు భాయి ( Yesubai ) పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవల రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ పోస్టర్ రష్మిక షేర్ చేస్తూ.
ప్రతి గొప్ప మహారాజు వెనుక బలమైన మహారాణి ఉంటుంది.స్వరాజ్యానికి గర్వకారణమైన యేసు బాయిని మీకు పరిచయం చేయబోతున్నాం అంటూ రష్మిక ఈ పోస్టర్ షేర్ చేశారు.
ఇలా ఈ సినిమా ద్వారా రష్మిక మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తూ మరో సక్సెస్ అందుకోబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు.