ప్రస్తుత వింటర్ సీజన్( Winter season ) లో విరివిగా లభ్యమయ్యే పండల్లో ఆరెంజ్ ఒకటి.( Orange ) ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆరెంజ్ పండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అయితే ఆరెంజ్ పండ్లను తినే క్రమంలో వాటి తొక్కలను డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.కానీ ఇకపై అలా చేయకండి.
నిజానికి అందాన్ని రెట్టింపు చేయడంలో ఆరెంజ్ పీల్ అద్భుతంగా తోడ్పడుతుంది.ఆరెంజ్ తొక్కలో విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు సహజ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
మరి చర్మానికి ఆరెంజ్ పీల్ ను ఎన్ని విధాలుగా వాడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రెమెడీ 1: ఆరెంజ్ తొక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్ తీసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood powder ), వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఆ రెమెడీ చర్మానికి సహజ కాంతిని తెస్తుంది.అదనపు నూనెను తగ్గిస్తుంది.
స్కిన్ కలర్ ను ప్రమోట్ చేస్తుంది.

రెమెడీ 2: ఆరెంజ్ తొక్కలను బాగా ఎండబెట్టి మిక్సీ జార్ లో మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), పావు టీ స్పూన్ పసుపు మరియు సరిపడా ఫ్రెష్ టమాటో జ్యూస్( Tomato juice ) వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఫేస్ కు అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయాలి.
ఆ రెమెడీ మొటిమల తాలూకు గుర్తులను, నల్లటి మచ్చలను వదిలిస్తుంది.యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మెరిపిస్తుంది.

రెమెడీ 3: ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్( Oats powder ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.తద్వారా చర్మంపై డెడ్ స్కిల్స్ తొలగిపోతాయి.
టాన్ రిమూవ్ అవుతుంది.చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది.
ప్రకాశంతంగా కనిపిస్తుంది.