సోమవారం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది లే కానీ, ఆన్‌లైన్‌లో మాత్రం మీమ్స్, వైరల్ వీడియోలతో నిండిపోయింది.
అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ (Hillary Clinton)చేసిన ఒక పని అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రంప్ (Trump)తన ఫస్ట్ స్పీచ్‌లో మెక్సికో గల్ఫ్‌ను “గల్ఫ్ ఆఫ్ అమెరికా”గా పేరు మారుస్తానని ప్రకటించారు.
అంతేకాదు, ఇది త్వరలోనే జరుగుతుందని కూడా చెప్పారు.దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు, కానీ హిల్లరీ(Hillary) మాత్రం బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.హిల్లరీ నవ్వుతుంటే, ఆమె పక్కనే ఉన్న భర్త బిల్ క్లింటన్(Bill Clinton) ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు.
ముందు వరుసలో కూర్చున్న జో బైడెన్, కమలా హారిస్, డగ్ ఎంహాఫ్ (Joe Biden, Kamala Harris, Doug Emhoff)మాత్రం ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా మౌన ప్రేక్షక పాత్ర పోషించారు.ఈ వీడియోను ఎక్స్‌లో కోటి మందికి పైగా చూశారు.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.“నేను కూడా నవ్వాను.ఆ గల్ఫ్‌కు ఏ పేరు పెడితే ఏంటి?” అని ఒకరు కామెంట్ చేయగా, “తర్వాత పసిఫిక్ మహాసముద్రాన్ని ‘ఫ్రీడమ్ ఓషన్’ అని పెడతారేమో” అని మరొకరు జోక్ చేశారు.“ఆమె నవ్వకుండా ఏం చేస్తుంది? నవ్వడం ఆమె బాధను తగ్గించుకునే మార్గం” అని ఇంకొకరు సెటైర్ వేశారు.“మనందరం ఇప్పుడు హిల్లరీ క్లింటన్ లాగే ఉన్నాం” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ట్రంప్ కొన్ని కీలకమైన ఉత్తర్వులపై సంతకం చేశారు.అందులో ఒకటి ఫెడరల్ ఉద్యోగులందరూ పూర్తిస్థాయిలో ఆఫీసులకు రావాలని ఆదేశించడం.ఇది గవర్నమెంట్ ఆఫీసులను నార్మల్ స్థితికి తీసుకురావడానికి ముఖ్యమని ఆయన అన్నారు.
ఈ సంతకాల కార్యక్రమం వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ అరేనాలో జరిగింది.