మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) గురించి మనకు తెలిసిందే.మరి ఈ సినిమాతో రాజమౌళి మరోసారి తన సత్తాను చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఏకంగా ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు( Oscar Award ) అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఆయన కనక ఆస్కార్ అవార్డుని గెలుచుకుంటే మాత్రం తెలుగు సినిమా స్థాయి అనేది పెరిగిపోతుందనే చెప్పాలి.

ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి ఆస్కార్ అవార్డు అయితే రాలేదు.ఆస్కార్ అవార్డు కోసం చాలావరకు ప్రయత్నమైతే చేస్తున్నాడు.మరి తను చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక త్రిబుల్ ఆర్( RRR ) సినిమాలో సాంగ్ కి ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది.
మరి దానిని మినహాయిస్తే దర్శకుడిగా రాజమౌళికి కూడా ఆస్కార్ అవార్డు వస్తే ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం అయితే దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడంలో రాజమౌళి చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

ఇక ప్యాన్ వరల్డ్ ప్రేక్షకులను కూడా అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పటికే బాహుబలి సిరీస్ తో పాటు ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకున్న ఆయన రాబోయే సినిమాలతో కూడా అదే ఫార్మాట్లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఆయన అనుకున్నట్టుగానే మహేష్ బాబు సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… చూడాలి మరి రాజమౌళి ఆస్కార్ అవార్డు గెలుచుకుంటాడా లేదా అనేది…అలాగే మహేష్ బాబు కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.