స్టార్ హీరో నాని( Nani ) హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్లో తెరకెక్కిన హాయ్ నాన్న( Hi Nanna ) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా కలెక్షన్ పరంగా కూడా అదరగొట్టింది.
ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు.శ్రుతి హాసన్ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఒక సాంగ్ లో మెరిశారు.
అయితే ఈ సినిమా కథపై కాపీ ఆరోపణలు వ్యక్తం కావడం గమనార్హం.
ప్రముఖ కన్నడ నిర్మాత ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య( Producer Pushkara Mallikarjunaiah ) తాను నిర్మించిన భీమసేన నలమహారాజ( Bheemasena Nalamaharaja Movie ) ఆధారంగా హాయ్ నాన్న మూవీ రూపొందిందని చెప్పుకొచ్చారు.రీమేక్ హక్కులను కొనుగోలు చేయకుండానే తమ సినిమాను తెలుగులో హాయ్ నాన్న పేరుతో తెరకెక్కించారని ఆయన అన్నారు.

ప్రస్తుతం నిర్మాత చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా తెరకెక్కింది.హీరో నాని కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.హాయ్ నాన్న సినిమా కమర్షియల్ గా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.
హాయ్ నాన్న కాపీ ఆరోపణలపై మేకర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

సాధారణంగా నాని తన సినీ కెరీర్ లో రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారు.నాని ప్రస్తుతం హిట్3 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
నానికి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంచనాలకు మించి పెరుగుతోంది.