నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!

ముఖంలో మెరుపును మాయం చేయడంలో నల్లటి వలయాలు ముందు వరుసలో ఉంటాయి.ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు, పలు రకాల మందుల వాడకం తదితర అంశాలు కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు( Dark circles ) ఏర్పడడానికి కారణం అవుతుంటాయి.

 These Are The Super Powerful Remedies To Get Rid Of Dark Circles! Dark Circles,-TeluguStop.com

ఇవి చూడటానికి అసహ్యంగా కనిపించడమే కాకుండా అందాన్ని కూడా పాడు చేస్తాయి.ఈ క్రమంలోనే నల్లటి వ‌లయాల‌ను వ‌దిలించుకునేందుకు ఎన్నెన్నో ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీస్( Home remedies ) మాత్రం నల్లటి వలయాలను సమర్థవంతంగా మరియు వేగంగా మాయం చేస్తాయి.

మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Darkcircles, Latest, Skin Care, Skin Care Tips, Powerfulrid-Telugu

రెమెడీ 1:

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మల్తానీ మట్టి ( Maltani soil )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ కొబ్బరిపాలు( Fresh coconut milk ), వన్ టేబుల్ స్పూన్ కీర దోసకాయ జ్యూస్( Keera Cucumber Juice ), వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.

ఆపై వాటర్ తో ఐ మాస్క్ ను తొలగించాలి.రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేశారంటే వారం రోజుల్లోనే మీరు రిజల్ట్ గమనిస్తారు.

ఈ రెమెడీ నల్లటి వలయాలను చాలా వేగంగా వ‌దిలిస్తుంది.

Telugu Tips, Darkcircles, Latest, Skin Care, Skin Care Tips, Powerfulrid-Telugu

రెమెడీ – 2:

మిక్సీ జార్ లో బాగా పండిన కొన్ని టమాటో ముక్కలు వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో వన్ టీ స్పూన్ బాదం ఆయిల్, వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఆపై మరో 10 నిమిషాలు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించినా కూడా నల్లటి వలయాలకు గుడ్ బై చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube