తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.ఇక అదే రీతిలో అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ సైతం స్టార్ డైరెక్టర్ గా తనకంటూ మంచి క్రేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్న నేపధ్యంలో ఇప్పుడు చిరంజీవితో ( Chiranjeevi )సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.
ఇక ఇప్పటికే ఆయన చేసిన 8 సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వగా ఇప్పుడు తొమ్మిదో సినిమాగా త్రిబుల్ హ్యాట్రిక్ సాధించడానికి చిరంజీవితో సినిమా చేస్తున్నాడు.

మరి ఇది ఏమైనా కూడా అనిల్ రావిపూడి ( Anil Ravipudi )నుంచి ఒక సినిమా వస్తుందంటే సగటు ప్రేక్షకులందరికి అమితమైన ఆనందమైతే ఉంటుంది.మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్లతో రూపొందించడానికి సిద్ధమయ్యారట.ఇక ఏది ఏమైనా కూడా తనకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )పటాస్ లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందించాడు.
అయితే కళ్యాణ్ రామ్ తో ‘పటాస్ 2’( Patas 2 ) సినిమాను కూడా తెరకెక్కిస్తానని ఆ తర్వాత చాలా సందర్భాల్లో తెలియజేసినప్పటికి ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు అయితే పట్టాలెక్కలేదు.మరి ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక కళ్యాణ్ రామ్ కూడా ‘బింబిసార 2’ సినిమాతో పాటు మరొక సినిమాని కూడా లైన్ లో పెట్టాడు.

ఇక ప్రస్తుతం ఆ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్న నేపధ్యం లో రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇప్పటికే కళ్యాణ్ రామ్ తో చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికల రూపొందించుకుంటున్నారు.ఇక అలాగే అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో పటాస్ 2 సినిమా వస్తే చూడడానికి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…