భారత క్రికెట్ టీమ్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి( Ranji Trophy ) తిరిగి వచ్చినా ఆయన అభిమానులకు నిరాశే ఎదురైంది.కోహ్లీ బ్యాటింగ్‌ను చూడటానికి స్టేడియంకు భారీగా తరలివచ్చిన అభిమానులు అతని ఇన్నింగ్స్ కేవలం ఆరు పరుగులకే ముగియడంతో నిరుత్సాహానికి గురయ్యారు.రంజీ ట్రోఫీలో ఢిల్లీ( Delhi ) తరఫున మళ్లీ బరిలోకి దిగిన కోహ్లీ, రైల్వేస్ బౌలర్ హిమాన్షు సంగ్వాన్( Bowler Himanshu Sangwan ) వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.15 బంతులు ఆడిన కోహ్లీ కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు.ఒక ఫోర్ కొట్టి, మళ్లీ అదే తరహా షాట్ ఆడే ప్రయత్నం మిస్ కావడంతో ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది.కోహ్లీ ఔట్ అవ్వగానే స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.
నిరాశ చెందిన అభిమానులు స్టేడియం వదిలి వెళ్లిపోయారు.
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో నిరంతర అపజయాలను ఎదుర్కొంటున్న కోహ్లీ, తిరిగి తన ఫామ్‌ను అందుకోవడానికి దేశవాళీ క్రికెట్‌ను ఎంచుకున్నాడు.2012లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడిన కోహ్లీ 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఢిల్లీ తరఫున బరిలో దిగాడు.ఈ మ్యాచ్ కోసం 15 వేలకుపైగా అభిమానులు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చారు.
కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు.రైల్వేస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది.
ఢిల్లీ వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.అయితే, అతను నిలదొక్కుకోలేకపోయాడు.
కోహ్లీ ఔట్ కావడంతో, అభిమానులు ఒక్కసారిగా స్టేడియం వదిలి వెళ్లడం గమనార్హం.
అంతర్జాతీయ స్థాయిలో వరుసగా విఫలమైన తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చినా కానీ, రంజీ ట్రోఫీలోనూ నిరాశపర్చడంతో అతని ఫామ్‌పై మరింత సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తను తిరిగి తన క్లాస్ చూపిస్తాడా? లేక ఫామ్ కోల్పోయినట్టేనా? అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే మ్యాచ్‌ల్లో తెలుస్తుంది.కోహ్లీ మళ్లీ పరుగుల వరద పారిస్తాడని ఆశించిన అభిమానులు ఈ నిరాశను ఎంతవరకు జీర్ణించుకుంటారో చూడాలి.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ అవుట్ సంబంధిత వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.