తెలంగాణలో తాజాగా ఎన్నికైన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి(Jadcharla MLA, Janampally Anirudh Reddy) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.ఆయన బహుళ వ్యాపారాలు కలిగి ఉన్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.
తన విలాసవంతమైన జీవనశైలితో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.తాజాగా, అనిరుద్ రెడ్డి (Anirudh Reddy)తన వెండితో మెరిసిపోతున్న బెడ్ రూమ్‌ను(bedroom) ప్రజలకు చూపించారు.
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ స్వర్గంలా మెరిసిపోతున్న తన బెడ్ రూమ్ ప్రత్యేకతలను వివరించారు.ఈ వీడియో వైరల్‌గా మారడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ వీడియోలో చూపించినట్లుగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన బెడ్ రూమ్‌ను వెండితో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు.ఇందులో వెండితో తయారైన సోఫాసెట్, కుర్చీలు, డ్రెస్ టేబుల్, బెడ్(Sofa set, chairs, dressing table, bed), గదిలోని ఇతర అంతస్తులు, అలంకరణ వస్తువులు కూడా వెండితోనే తయారు చేయించారు.ఈ ప్రత్యేక ఇంటీరియర్ డిజైన్ చూసిన నెటిజన్లు “ఇదేనా రాజ వైభోగం?”, “ఇంత వెండిని ఎలా తెచ్చుకున్నారు?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జనంపల్లి అనిరుద్ రెడ్డి 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేశారు.తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి, అనేక మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించారు.
చివరకు రాజకీయాల్లోకి ప్రవేశించి, తనదైన శైలిలో ఆకర్షణీయమైన రాజకీయం చేస్తున్నారు.ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బెడ్ రూమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొంతమంది ఇది ఆయన సంపాదనకు తగిన విలాసతనం అంటుంటే, మరికొందరు ప్రజాప్రతినిధిగా ఇలా ప్రదర్శన అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.ఏదేమైనా, అనిరుద్ రెడ్డి వెండి బెడ్ రూమ్ సంచలనంగా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.మీరు దీనిపై ఏమనుకుంటున్నారు?