ముద్దు అనే విషయం మానవ సంబంధాల్లో ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.అంతేగాక రోజు భార్య భర్తలు చుంబించికోవడం వలన తమ హావ భావాలను కూడా ఒకరితో ఒకరు పంచుకోవడానికి ముద్దు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.
అయితే తాజాగా వాలెంటెన్స్ డే లో భాగంగా కిస్ డే సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం నుంచి కొందరు శాస్త్రవేత్తలు ముద్దు అనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ముద్దు పెట్టుకోవడం వలన కలిగే టువంటి ప్రయోజనాలను కనుగొన్నారు.
భార్యాభర్తలు లేదా ప్రేమికులు తమ బంధాలని మెరుగుపరుచుకునేందుకు కొంతమంది తరుచూ తమకు ఇష్టమైన వాళ్ళని ముద్దాడుతూ ఉంటారని అన్నారు.అంతేగాక తమకు ఇష్టమైన వాళ్ళకి రోజు నుదుటిపై ముద్దు పెట్టడం ద్వారా వారిపై ప్రేమ మరింత పెరుగుతుందని మరియు అనుమానం, ఒత్తిడి వంటి విషయాలను సులభంగా జయించగల గలుగుతారు అంటున్నారు శాస్త్రవేత్తలు.
అయితే స్త్రీలల్లో సైటో మొగలో వైరస్ అనే బ్యాక్టీరియా స్త్రీ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని, ఈ బ్యాక్టీరియా మగవారి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ ఇది మగవారు తరచు భార్య ని చూపించడం వలన ఈ బాక్టీరియా మగవారికి కూడా వ్యాప్తి చెంది వారిలో ఉన్నటువంటి నిరోధక శక్తి మరింత బలపడుతుందని అంటున్నారు.
అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన అటువంటి హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ చెప్పినట్లు ఒక్కసారి కిస్ చేస్తే మూడు వేల క్యాలరీలు ఖర్చు అవుతాయని దీని వల్ల బరువు తగ్గే వారికి కూడా ఇది ఒక చిన్న చిట్కా ఉపయోగపడుతుందని అంటున్నారు.ఏదేమైనప్పటికీ తమకు ఇష్టమైన వారిని పెదాల మీద కంటే నుదిటి పై ముద్దు పెట్టుకుంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమని అంటున్నారు.అంతేకాక ఇలాంటి ముద్దు వల్ల మగవాళ్ళపై ఉన్నటువంటి నమ్మకం మరింత రెట్టింపు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.