వైసీపీకి ' గ్లామర్ ' తగ్గిందా ? తగ్గిస్తున్నారా ?

రాజకీయాలు, సినిమారంగం వేరైనా ఇప్పటి పరిస్థితుల్లో ఆ రెండిటినీ వేరు చేసి చూసే పరిస్థితి లేదు.సినీ నటులు అంతా ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఉంటూ, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు.

 Cinima Galmour Not Showing In Ycp Party , Ap Cm Jagan, Roja, Pruthvi Comedian, J-TeluguStop.com

కొంతమంది ఎమ్మెల్యేలు ,మంత్రులు గా అవకాశం పొందారు.మరికొందరు మాత్రం నామినేటెడ్ పోస్ట్ లు సంపాదిస్తూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ వస్తున్నారు.

ఇక రాజకీయ పార్టీలు కూడా సినీ నటులను, హీరోలను తమ పార్టీలకు మద్దతుదారులుగా ఉండేలా చూసుకుంటున్నాయి.మొదటి నుంచి చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా సినీ మద్దతు ఉండేది.

దీనికి కారణం ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ అప్పటికే సినీ రంగంలో మకుటం లేని మహారాజు లా వెలుగొందుతూ ఉండడమే.ఆయన పార్టీ స్థాపించిన సమయంలోనే ఆయన వెంట అనేకమంది సినీ రంగ ప్రముఖులు నడిచారు.

ఇక అప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్ర విడిపోయే వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సినీ ఇండస్ట్రీ ఉండగా, ఇక రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సినీ రంగం కూడా రెండుగా విడిపోయింది.

Telugu Ap Cm Jagan, Bhanuchandar, Giri Babu, Posanikrishna, Pruthvi, Raja, Roja-

తెలంగాణ లో సినీ పరిశ్రమ స్థిరపడటంతో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరిగింది.ఇక ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరిగింది.జగన్ కూడా సినీ ప్రముఖులకు తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో చాలామంది ఆ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు.

ఇప్పటికే సినీ రంగానికి చెందిన రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆమెకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తున్నారు జగన్.ఇక మొదటి నుంచి జగన్ కు మద్దతు ఇస్తూ వస్తున్న వ్యక్తుల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఉన్నారు.జగన్ కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించారు.అయితే పృద్వి స్వయంకృతాపరాధం వల్ల ఆ పదవిని పోగొట్టుకున్నారు.

Telugu Ap Cm Jagan, Bhanuchandar, Giri Babu, Posanikrishna, Pruthvi, Raja, Roja-

ఇక జీవిత రాజశేఖర్, పోసాని కృష్ణమురళి, భానుచందర్, హీరో రాజా, గిరి బాబు, జయసుధ, రఘుబాబు, డైరెక్టర్ నిర్మాత కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి వంటివారు జగన్ కు మద్దతుగా నిలబడినా, ఇప్పుడు ఎక్కడా వారి హడావుడి కనిపించడం లేదు.ఇక జగన్ కు బంధువైన మంచు మోహన్ బాబు సైతం వైసీపీకి దూరంగానే ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.సినీ నటుల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, క్షేత్రస్థాయిలో వారి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఏమీ లేదు అనే అభిప్రాయంతో జగన్ ఉన్నారని, దాని కారణంగానే ఈ రంగానికి చెందిన వారిని పెద్దగా పట్టించుకోవడం లేదనే వాదన తెర మీదకు వస్తోంది.అందుకే కొంత కాలంగా సినీ గ్లామర్ ఎక్కడ అ వైసీపీలో కనిపించడం లేదు.

వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తూ వచ్చిన కమెడియన్ పోసాని కృష్ణమురళి సైతం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube